ఆర్.ఎమ్.ఎమ్.ఎ ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
రూ 72,500 విలువైన నిత్యవసర వస్తువులు పంపిణీ
దాతల సహాయం అభినందనీయం - సిఐ వి.కృష్ణ
రావులపాలెం, పెన్ పవర్
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో రావులపాలెం మండల మీడియా అసోసియేషన్ (ఆర్.ఎం.ఎం.ఏ) ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మంగళవారం రావులపాలెం లోని అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సి.ఐ వి.కృష్ణ, మండల అభివృద్ధి అధికారి, జి రాజేంద్రప్రసాద్, తహసీల్దారు యూసుఫ్ జిలానీ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా 22 మంది విలేకరులకు ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యం,ఆయిల్ 3లీటర్లు, ఒక కేజీ పంచదార, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ గోధుమ పిండి, ఒక కేజీ బెల్లం, ఒక కేజీ చింతపండు ఐదు కేజీల ఉల్లిపాయలు, ఒక కెజి కరాచీ నూక చొప్పున అందజేశారు. ఈ సందర్బంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా సమాజంలో ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న విలేకరులు తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్థులు స్వచ్ఛందంగా సహాయం అందించటం అభినందనీయమన్నారు. ఈ సంధర్భంగా రూ. 72,500 తో నిత్యవసర వస్తువులు సమకూర్చిన దాతలు స్వగృహ కనస్ట్రక్షన్స్ అధినేత కర్రి వీర్రెడ్డి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, మాజీ ఎంపిటీసి కుడిపూడి శ్రీనివాస్ , టింబర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ అధికారి నాగేశ్వరరావు, రాచకొండ శ్రీనివాస్, ఎమ్.ఎస్, కొవ్వూరి అప్పారెడ్డి,
భాస్కర స్వీట్స్ గొలుగూరి సోమిరెడ్డి , మన్యం సుబ్రహ్మణ్యం, కర్రి సుబ్బారెడ్డి, యస్. రామకృష్ణంరాజు, కోట చెల్లయ్య, భమిడిపాటి శ్రీనివాసరావులకు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చెల్లుబోయిన ఉమామహేశ్వరరావు, కొండేటి గంగాధర్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ జగజ్జీవన్ రావ్ గౌరవ అధ్యక్షులు కోటిపల్లి రామారావు, వైస్ ప్రెసిడెంట్ చిర్రా నాగరాజు, సంయుక్త కార్యదర్శి ఉందుర్తి సురేష్, కోశాధికారి దొండపాటి మూర్తి , కార్యవర్గ సభ్యులు గుత్తుల శ్రీనివాస్, కోనాల వెంకట్రావు, వెంకటేశ్వరరావు, మండపాటి గంగాధర్, ఆనంద్, చిట్టూరి నాగరాజు, జాలాది సహదేవుడు, ఎల్.ఐ.సి నాగరాజు, గండ్రోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment