రబీ ధాన్యం సేకరణ లక్ష్యం 30వేల టన్నులు
జిల్లా వ్యాప్తంగా 40 కొనుగోలు కేంద్రాలు
ఈ నెలాఖరుకల్లా మిల్లర్లు సిఎంఆర్‌ను అప్పగించాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్
విజయనగరం, పెన్ పవర్
రబీలో సుమారు 30వేల టన్నుల ధాన్యం సేకరణకు సిద్దం కావాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో తన ఛాంబర్‌లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ రబీలో జిల్లాలో సుమారుగా 6,469 హెక్టార్లలో వరిపంట సాగయ్యిందన్నారు. దీనిద్వారా దాదాపు 32,409 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. దీనిలో 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దీనికోసం ధాన్యం పండిన ప్రాంతాల్లోనే 40 వరకూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఈనెలాఖరును వీటిని ప్రారంభించేందుకు సిద్దం చేయాలని సూచించారు. ఖరీఫ్ లో సేకరించిన ధాన్యానికి సంబంధించి ఇంకా 25శాతం వరకూ మిల్లర్లనుంచి సిఎంఆర్ రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు ఎఫ్‌సిఐకి 78వేల మెట్రిక్ టన్నులు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు 60వేల టన్నుల బియ్యాన్ని ఇచ్చారని తెలిపారు. ఇంకా రావాల్సిన సుమారు 44వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్నీ, ఈనెలాఖరులోగా అందజేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ఈ సందర్భంగా మిల్లర్లు జెసికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ వరకుమార్, డిఎస్ఓ ఏ.పాపారావు, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, మార్కెటింగ్ ఏడి శ్యామ్‌కుమార్, సహకార అధికారి నారాయణరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండపల్లి కొండలరావు, వర్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment