Followers

గిరిజనులు  చట్టవ్యతిరేక  చర్యలకు  దూరంగా  ఉండాలి




గిరిజనులు  చట్టవ్యతిరేక  చర్యలకు  దూరంగా  ఉండాలి.. గ్రామ మహిళా పోలీస్ ధనలక్ష్మి


వి.మాడుగుల... పెన్ పవర్...


గిరిజనులు  చట్టవ్యతిరేకమైన  చర్యలకు  పాల్పడవద్దని   గ్రామ మహిళా పోలీస్ వీర్ని ధనలక్ష్మి  అన్నారు. మంగళవారం  జాలం పల్లి పంచాయతీ గొప్పూరులో  గిరిజన మహిళలలో   చట్టాలపై అవగాహన  కల్పించారు. నాటు సారా  తయారీ  అమ్మకాలు  చేయకూడదని. మత్తుపదార్థాలు   గంజాయి  మద్యం  వాటిని  దూరంగా ఉంచాలన్నారు. వ్యక్తిగత కక్షలు  ఘర్షణలు  పడవద్దని  శాంతియుతంగా  కలిసి  మెలసి  జీవించాలన్నారు. కష్టపడి పనిచేసి సంపాదనను  దుబారా చేయవద్దని ఆమె హితవు పలికేరు. ఈ కార్యక్రమంలో  మాజీ జడ్పీటీసీ  గొల్ల వెళ్లి  ప్రభావతి  సంజీవ్  ప్రసంగిస్తూ  గిరిజనుల కోసం  ప్రభుత్వం  అనేక సంక్షేమ పథకాలు  అమలు చేస్తుందని  వాటిని ప్రతి ఒక్కరు  సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.కరోనా   మహమ్మారి  కారణంగా  ఇబ్బందులు పడకుండా  ప్రభుత్వం  నెలకు  మూడు దఫాలు  ఉచిత బియ్యం  శనగలు  పంపిణీ చేస్తున్నారని వాటిని  ప్రజలు  సద్వినియోగం చేసుకోవాలని కోరాడు. కరోనా వైరస్  నియంత్రణలో భాగంగా  గిరిజనులు  మాస్కులు ధరించాలని  వ్యక్తిగత దూరం  పాటిస్తూ  తమ పనులు  చేసుకోవాలన్నారు. పరిశుభ్రత  తాగునీరు   పాటించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి అభ్యర్థి రమణమ్మ  ఎంపీటీసీ అభ్యర్థి చిన్న  వై ఎస్ ఆర్ సి పి  కార్యకర్తలు  గిరిజన మహిళలు పాల్గొన్నారు.

 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...