ఎన్ పవర్... ఎస్. రాయవరం.
కరోనా లాక్ డౌన్ వల్ల అవస్దలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, గ్రామస్తులకు నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేసి రామ చంద్ర రాజు మానవత్వం చాటుకున్నారు. కోరుప్రోలుకి చెందిన సాధారణ రైతు రామ చంద్ర రాజు గురువారం ప్రజలు విలేకరుల కు బియ్యం పప్పులు కూరగాయలు అందచేశారు. ఎస్ రాాాయవరం మండలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కు10 కేజీల బియ్యం, 4 రకాల పప్పు దినుసులు,పామాయిల్ నూని,చింతపండు,బెల్లం తదితర సరుకులు పంపిణీ చేశారు.
అంతకు ముందు గ్రామంలో టన్ను కూరగాయలు పంపిణీ చేశారు.గ్రామంలో నివసిస్తున్న అన్ని కుటుంబాలకు ఈ కూరగాయలు అందే టట్లు ఏర్పాట్లు చేశారు.ప్రతీ ఇంటికి 5 కేజీల కూరగాయలు అందజేశారు.ఈ పంపిణీ చేసేందుకు గ్రామంలో నున్న యువకులు స్వచ్చందంగా వచ్చారు.ఈ యువకుల సాయంతో 10 ఆటోలలో ఈ కూరగాయలను ప్రతి వార్డు, అయితే రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదని పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అందరికీ సామాజిక దూరం పాటించాలని రామ చంద్ర రాజు తెలిపారు.
No comments:
Post a Comment