Followers

నాటు పడవ బోల్తా పడి  గిరిజన మహిళ మృతి.


 


నాటు పడవ బోల్తా పడి  గిరిజన మహిళ మృతి.



   ఈదుకుంటూ  ఒడ్డుకు చేరిన భర్త  కుమారుడు .



       స్టాప్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)



జిల్లాలోని  చీడికాడ మండలం  కోణం  జలాశయంలో  నాటు పడవ  బోల్తా పడి  గిరిజన మహిళ   మృతి చెందింది.  చీడికాడ పోలీసులు  అందించిన సమాచారం మేరకు  గురువారం ఉదయం  కోనం గ్రామానికి చెందిన  దారపర్తి  కొండలరావు  భార్య  దేవుడమ్మ  కుమారుడు  శ్రీరామ్  కలిసి   నాటు పడవ పై కోనాం  జలాశయం  అవతల వైపుకు  వెళ్లారు.  ఇల్లు  నేతకు  ఉపయోగించే  తాటి కమ్మ   నాటు పడవలో  వేసుకొని  తిరిగి  గ్రామానికి వస్తుండగా  జలాశయం మధ్యలో   నాటు పడవ  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  దేవుడమ్మ  జలాశయంలో మునిగి పోయింది. భర్త  కొండలరావు  కుమారుడు శ్రీరామ్   అతి కష్టం మీద ఈదుకుంటూ  ఒడ్డుకు చేరారు. కేకలు వేయడంతో  గ్రామస్తులు వచ్చి  గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రయత్నంలో  దేవుడమ్మ  శవ మై నీటి పై తేలింది. శవాన్ని  ఒడ్డుకు చేర్చి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని  చీడికాడ పోలీసులు  శవ పంచనామా జరిపించి  శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు . కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...