పేదలకు ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయులు.
గోకవరం, పెన్ పవర్
గోకవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంపయర్రంపాలెం ఉపాధ్యాయులు పేదలకు ఆర్థిక సహాయం అందజేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంపయర్రంపాలెం ఉన్నత పాఠశాల ఆవరణలో కరోనా లాక్ డౌన్ వల్ల బాధపడుతున్న నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు 26 మందిని గుర్తించి ప్రధానోపాధ్యాయులు కోలా సత్యనారాయణరావు మరియు ఉపాధ్యాయులు కలిసి 11000 రూపాయలతో ఒక్కక్కరికి 400 రూపాయలు విలువచేసే కూపన్స్ ఇచ్చి కిరాణా సామాన్లు కొనుక్కోవటానికి స్లిప్ లు ఇవ్వటం జరిగింది. వారికి అవసరమయిన సామాన్లు కొనుక్కొని ఉపాధ్యాయులుకు ధన్యవాదాలు తెలియజేసారు*
No comments:
Post a Comment