275 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేసిన పైడి మాంబ యూత్ సభ్యులు
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలం:సినిమా హాలు జెక్షన్ లోని పైడి మాంబ యూత్ అధ్యర్యంలో కరోనా ప్రభావం తో ఆర్ధిక ఇబ్బoధులు ఎదుర్కొంటున్న 275 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.శనివారం నాడు యూత్ సభ్యులు 5 1/2 కేజీ లు 8 రకాల కూరగాయలను పంపిణీ చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.యూత్ సభ్యులు ప్రజలు కరోనా భారిన పడకుండా ఎంతో శ్రమిస్తున్న గ్రామ పారిశుద్య కార్మికుల కు ఆశ వర్కర్లకు కూడా కూరగాయలను అందించారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు బొద్ధపు అయ్యబాబు,పయిల అప్పలనాయుడు,బోండా శ్రీనివాసరావు,రెడ్డి నాగేశ్వరరావు,చీపురుపల్లి కృష్ణ,రెడ్డి వెంకునాయుడు,పయిల నాయుడు(భద్రి),ఆడారి జానీ రాంబాబు,చొప్ప సతీష్,పయిల వెంకటరావు,కటారి నాయుడు(బాలు),పి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment