Followers

నిబంధనలు అతిక్రమించిన 249 అరెస్ట్.


నిబంధనలు అతిక్రమించిన 249 అరెస్ట్.
కమిషనర్  ఆర్కె మీనా.

స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం , పెన్ పవర్ : మజ్జి  శ్రీనివాస మూర్తి 


నిబంధనలు  అతిక్రమించిన  249 మందిని  అరెస్టు చేయడం జరిగిందని  విశాఖ నగర పోలీస్ కమిషనర్  ఆర్కె మీనా  తెలిపారు. సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఆరు గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు నగరంలో నిబంధనలను అతిక్రమించి రోడ్లపై  సంచరిస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న 87 మంది వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.  74 కేసులు  నమోదుచేసి  8 లక్షల 54 వేల 295 రూపాయలు అపరాధ రుసుము వివరించడం జరిగిందని తెలిపారు. లాక్ డౌన్  కారణంగా  ప్రజలు  నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని   వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే న్యూ కాలనీ,  అక్కయ్యపాలెం,  తాటి చెట్ల పాలెం  రెడ్ జోన్ల పరిధిలో  రోడ్లు  బారికేడ్ల తో    మూసి వేశామని  ప్రజల  రాకపోకలు  నిషేధించడం జరిగింది అన్నారు. నగరంలో  రెడ్ ఆలర్ట్  కొనసాగుతోందని,  నిబంధనలు ఎవరు అతిక్రమించిన  సహించేది లేదని  కమీషనర్   హెచ్చరించారు.


 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...