Followers

నాటుసారా అమ్మకాలు జరుపుతున్న 219 మందిపై కేసులు...


నాటుసారా అమ్మకాలు జరుపుతున్న 219 మందిపై కేసులు...



జనతా కర్ఫ్యూ తరువాత జిల్లాలోని 10 ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్వైజర్లు, సేల్సుమెన్లు తొలగింపు.



ఎక్సయిజ్ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాసరావు వెల్లడి..


పాడేరు, పెన్ పవర్:


 


రానున్న రెండు వారాల్లో నాటుసారా రహిత జిల్లాగా విశాఖపట్నం ను ఉంచడానికి ప్రణాలికను సిద్ధం చేశామని విశాఖ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం పాడేరు ఎక్సయిజ్ స్టేషన్ పరిధిలోని జల్లిపల్లి గ్రామంలో సారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాడేరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నెల రోజులుగా సారాపై దాడులు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 219 మంది నాటుసారా అమ్మకందారులను అరెస్ట్ చేసి, 3312 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అడవిదంగా జనతా కర్ఫ్యూ తరువాత లాక్డౌన్ నేపద్యంలో జిల్లా వ్యాప్తంగా అవకతవకలకు పాల్పడిన 10 ప్రభుత్వం మద్యం దుకాణాలలో సూపర్వైజర్లు, సేల్సుమెన్లు ను తొలగించామని స్పష్టం చేశారు. లాక్డౌన్ సందర్భంగా రాబోయే రెండు వారాలలో సారా నిర్ములనకు జిల్లా వ్యాప్తంగా  ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి, డి.అనిల్ కుమార్, విశాఖ టాస్క్ ఫోర్స్ అరుణ కుమారి, ఎన్ఫోర్సుమెంట్ ఎసై ఆచారి, 
పాడేరు ఎక్సయిజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...