Followers

పదమూడు గ్రామ వాలంటరీ పోస్ట్ లకు  21 మంది హాజరు.


పదమూడు గ్రామ వాలంటరీ పోస్ట్ లకు  21 మంది హాజరు.



వి మాడుగుల ...పెన్ పవర్.



మాడుగుల మండలంలో  ఖాళీగా ఉన్న 13 గ్రామ వాలంటీర్ పోస్టులకు  మంగళవారం  ఇంటర్వ్యూ  నిర్వహించామని   ఎంపీడీవో  పోలినాయుడు తెలిపారు మంగళవారం  ఆయన  విలేకరులతో మాట్లాడుతూ   జాలం పల్లి  1 కేజే పురం 1 ఎం కోడూరు 2 ఎం కోటపాడు  1 ది గుడివాడ 1 పోతన పూడి 1 ఎంకే వల్లపురం 2 పొంగలిపాక 1అవురు వాడ 2 తాటిపర్తి 1   వివిధ  కారణాల వల్ల  ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి  వీటిని   భర్తీ చేయాలని  జిల్లా అధికారుల ఆదేశాల మేరకు   ఇంటర్వ్యూలు  నిర్వహించామని  21 మంది  విద్యార్థులు  హాజరయ్యారని  ఎంపీడీవో  తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్  నియంత్రణలో భాగంగా  ఆయుష్  వైద్యాధికారుల సూచనల మేరకు  ఇటీవల తొమ్మిది వందల ఆర్సినిక్ ఆల్బం అనే ఆయుర్వేద మందులను  గ్రామ వాలంటీర్లు  సచివాలయ ఉద్యోగులకు    అందజేయడం జరిగిందన్నారు.  మరికొన్ని శాంపిల్స్  తప్పించి  జర్నలిస్టులకు  అందజేస్తున్నామని  ఆయన తెలిపారు. 10 ఏళ్ళు దాటిన వారు  ఉదయం ఆరు మాత్రలు  మూడు రోజులు తీసుకోవాలని సూచించారు. నిత్యం  కరోనా   ప్రభావిత ప్రాంతాల్లో   సంచరిస్తున్న  విలేకరులకు    ఆర్సినికం ఆల్బం  మందును  సరఫరా చేస్తున్నామని  పోలి నాయుడు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...