పారిశుద్ధ్య పనులు పరిశీలన...
ఎవరికి వారే వర్కర్స్...
గమనించిన ఎమ్మెల్యే...
సిబ్బంది సంఖ్య పెంచాలని ఆదేశం...
మండపేట, పెన్ పవర్
జిల్లా లో మరో నియోజకవర్గంలో లేని విధంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నిత్యం ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారంఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట పట్టణంలో సర్ధార్ వేగుళ్ళ వీర్రాజు నగర్, సంఘంపుంత రోడ్డు లో పారిశుధ్యం పనులను మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తో కలసి పరిశీలించారు. కాలనీలో పారిశుధ్యం నిర్వహిస్తున్న యువకుల వద్దకు వెళ్ళి పారిశుధ్యం పై అరా తీశారు. తాము మున్సిపాలిటీ కార్మికులం కాదని జవాబిచ్చారు. ఈ కాలనీ వాసులమని చెప్పారు. స్వచ్చందంగా 30 మంది యువకులు కలసి కాలనీని శుభ్రపరచుకుంటూన్నామన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురియ్యారు. వారందరినీ అభినందించారు. ఎందుకు వారే ఈ పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ చెయ్యటంలేదాఅని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నుండి నలుగురు వర్కర్లు మాత్రమే వస్తున్నారని ఆ యువకులు చెప్పారు.దీనివలన పారిశుధ్యం పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అందుచే వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. దీనిపై శానిటేషన్ అధికారులను ప్రశ్నించారు.ఫోన్ ద్వారా మున్సిపల్ కమీషనర్ కి విషయం తెలియజేసారు. కార్మికుల సంఖ్య పెంచాలన్నారు.
విధుల్లో పర్యటన...
కాలనీలో వీధిల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పారిశుద్ధ్య పరిస్థితి పరిశీలించారు.
కాలనీ ప్రజలతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని కోరారు.
లాక్ డౌన్ పాటిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేశారు.
డంపింగ్ యార్డ్ పరిశీలన...
అక్కడి నుండి సంఘంపుంత రోడ్డులో గల డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్ళి అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం మండపేట రైతుబజార్ ను పరిశీలించి అక్కడి కూరగాయ రేట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, మాజీ కౌన్సిలర్ మేడింటి సూర్యప్రకాష్, మున్సిపల్ అధికారులు ఇన్ ఛార్జ్ శానిటరీ ఇన్ స్పెక్టర్ ఎం.సత్తిరాజు, టిపిఎస్ కె.వీరభ్రహ్మం, సుభ్రహ్మణ్యం, డి.శ్రీనివాసు, ఎఇ కె.శ్రీనివాస్, తదితర్లు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే సేవలను ప్రజలు కొనియాడారు.
No comments:
Post a Comment