లాక్ డౌన్ ఎత్తివేసే వరకు సేవలు కొనసాగిస్తాం" సేవా స్ఫూర్తి,"
ఆరిలోవ. పెన్ పవర్ ప్రతినిధి కూచిపూడి భాస్కర్ కుమార్
తూర్పు నియోజకవర్గం రవీంద్ర నగర్ సేవా స్పూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల 27వ తారీకు నుండి మొదలుకుని ఇప్పటివరకు7556 మందికి మధ్యాహ్న భోజనం 9,10,11,12,13,వార్డులలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి పేదవారికి
మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు.. సేవా స్పూర్తి ఫౌండర్ ఒమ్మి అప్పలరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు దాతలు, మరియు ఓం సాయిరాం కేటరింగ్ సర్వీస్ అధినేత రాజు సహకారంతొ మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ లాక్ డౌన్ ఎత్తివేసే వరకు కొనసాగిస్తామని, ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించిన, అంధిస్తున్న దాతలకు ప్రత్యెకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు
No comments:
Post a Comment