Followers

ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా కోవిడ్..19 రిలీఫ్ మెజర్స్ అందజేత


ప్రగతి భారత్ ఫౌండేషన్..
కోవిడ్..19 రిలీఫ్ మెజర్స్


మేనేజంగ్ ట్రస్టీ, ఎంపీ పి విజయ సాయి రెడ్డి చేతుల మీదుగా విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయితీ ల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్ లు, శాని టైజర్, గ్రాసరీ వస్తువులను అందచేశారు. మంగళవారం సాయంత్రం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ప్రగతి భారతీ ట్రస్ట్ తరుపున కరోనా నియంత్రణ లో సేవలు అందిస్తున్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. జిల్లా లో 1400 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఈ గ్రాసరీ కిట్ లను అంద చేయడం సంతోషం గా ఉంది. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సోషల్ దూరంను ప్రజలు పాటించాలని కోరుతున్నాం..ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారం యంత్రాంగం శ్రమిస్తోంది. పైడితల్లి అమ్మ వారి దయ వల్ల జిల్లాలో పాజిటివ్ కేస్ లు రాకపోవడం జిల్లా ప్రజల అదృష్టం.  ఇదే సమన్వయం తో లాక్ డౌన్ నిబంధనలు, సోషల్ డిస్టెన్స్ పాటించి వచ్చే వారం రోజులు అత్యంత జాగ్రత్త గా ఉండాలని మనవి చేస్తున్నాం..ఎంతటి విపత్కర పతిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం దశల వారీ చర్యలు తీసుకుంది. ప్రజలు అపోహలు, పుకార్లను నమ్మ వద్దు.. ప్రజల క్షేమం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం..ప్రగతి ఫౌండేసన్ ద్వారా విజయ సాయి రెడ్డి అందిస్తున్న సాయం అభినందనీయం..జిల్లాలో 700 వరకు హోమ్ గార్డులు ఉన్నారు..వారికి కూడా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ,
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేస్ కూడా రాకుండా అహర్నిశలు శ్రమించిన మంత్రులు, అధికారులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు, సచివాలయ ఉద్యోగులు కి అభిననందలు తెలిపారు. కరోనా అంటు వ్యాధి అని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ముంగిటకు వెళ్లి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విదేశాల కన్నా భారత్ లో పారిశుద్ధ్యం సమస్య ఎక్కువ..మన ఇమ్యూనిటీ కూడా ఎక్కువ.. అయినా ఇక్కడ సమష్టిగా అందించే సేవలు వల్లే మనం కరోనా తీవ్రత నుంచి బయట పడ్డాం. పారిశుద్ధ్య కార్మికులు ఈ కిట్లు అంద చేస్తున్నాం..పోలీస్ శాఖ వారికి కూడా ఈ కిట్ లు అంద చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీర భద్ర స్వామి, బడుకొండ అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి, వైసీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీని వాసురావు, మున్సిపల్ కమీషనర్ వర్మ, ప్రగతి భారత్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...