జిల్లాకు చేరిన 1680 రేపిడ్ టెస్టింగ్ కిట్లు - వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక వేగవంతం
వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్
విజయనగరం, పెన్ పవర్ :
జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతంగా మరింత అధికంగా జరిగేందుకు రంగం సిద్దమయ్యింది. జిల్లా స్థాయిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు వీలుగా రాష్ట్ర పభుత్వం పంపిన 1680 రాపిడ్ టెస్టింగ్ కిట్లు శుక్రవారం జిల్లాకు చేరాయి. ఈ కిట్ ల ద్వారా కేవలం పది నిముషాల వ్యవధిలో నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవకాశం వుంది. జిల్లాలో మరింత పెద్ద ఎత్తున వ్యాధి లక్షణాలు వున్నట్టు అనుమానిస్తున్న వారికి పరీక్షలు జరపడం ద్వారా వ్యాధి వ్యాప్తిపై సరైన అంచనాలు వేసి నివారణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. జిల్లాకు వచ్చిన టెస్టింగ్ కిట్లతో జిల్లా పరిషత్ అథితి గృహంలో వున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి నేతృత్వంలో వైద్య సిబ్బంది నిర్ధారణ పరీక్షలు జరిపారు. కరోనాకు నెగటివ్ గా వచ్చినట్టు డి.ఎం.హెచ్.ఓ. డా.రమణ కుమారి ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యాధిగ్రస్తుల ఇళ్ళ వద్దకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేస్తామని డి.ఎం.హెచ్.ఓ. చెప్పారు. ఈ టెస్ట్ కిట్ల ద్వారా పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటికీ ఈ వ్యాధి ఇప్పుడే సోకిందా లేదా చాలా కాలం క్రితం సోకిందా అనే విషయం కుడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంతో సులువుగా ఈ టెస్ట్ చేయవచ్చని, ఈ పరీక్షల నిర్వహణలో వైద్యులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చామని తెలిపారు.
No comments:
Post a Comment