కరోనా నియంత్రణకు 15 లక్షల రూపాయలను సహాయం చేసిన రక్షిత్ ఫార్మా
పరవాడ పెన్ పవర్
కరోనా నియoత్రణకు జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీలోని కంపెనీల యజమానులు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చి వారి సామాజిక బాధ్యతతో ఉదారతను చాటుకుంటున్నారు.గురువారం రక్షిత్ ఫార్మా యాజమాన్యం కరోనా నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల చెక్ ను జిల్లా లో కరోనా నివారణ చర్యల కోసం 5 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ వినయ్ చెంద్ కు ఆ సవస్థల ఛైర్మన్ సిహెచ్.ఏ.పి రామేశ్వరరావు,సంవస్థ స్థానిక ప్రతినిధి పాపయ్య దొర అందజేశారు.ఇదే కాకుండా సవస్థ ఇప్పటికే స్థానిక గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment