1400 కుటుంబాలకు కూరగాయలు, గుడ్లు, పంపిణీ చేసిన,బూరుగుపాలెం, వైఎస్ ఆర్ నాయకులు.
మాకవరపాలెం. పెన్ పవర్
మండలంలో బూరుగుపాలెం, అప్పన్నదొరపాలెం,తాడపాల, పంచాయతీల పరిధిలోని గ్రామాలలోని 1400 కుటుంబాలకు వైయస్సార్ సిపి మండల అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ, మరియు వైఎస్ ఆర్ నాయకులు తమ సొంత నిధులు రూ.లక్షా 20 వేలతో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తమ సొంత నిధులతో ఈ సరుకులు పంపిణీ చేస్తున్నామని, అదేవిధంగా గా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరామని తెలిపారు. ప్రజలకు ఏ విధమైన కష్టమొచ్చినా ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహకారంతో ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ గ్రామ పెద్దలు వైయస్సార్ సిపి నాయకులు, భీమిరెడ్డి గోవిందరావు,రమణ,నాయుడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మాకవరపాలెంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎల్లంపల్లి వెంకటరమణ 170 మంది పేదలకు ఐదు కిలోల బియ్యం, కిలో ఉల్లిపాయలు పంపిణీ చేశారు.
No comments:
Post a Comment