వెయ్యి లీటర్ల బెల్లపు ఊట, 140 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసిన పోలవరం ఎక్సైజ్ సిబ్బంది
పెన్ పవర్, గోపాలపురం ప్రతినిధి రాము
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ మద్యం కాపునాటుసారా క్రయ విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలవరం ఎక్సైజ్ సీఐ జి. సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం మండలంలోని బుచ్చయ్య పాలెం గ్రామంలో నాటు సారా తయారీ కి 1000 లీటర్లు బెల్లపు ఊట నిల్వ ఉంచగా బుధవారం సమాచారం మేరకు ఆ ప్రదేశానికి వెళ్లి బెల్లపు ఊట నాశనం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని సగ్గొండ గ్రామ శివారు గోపవరం గ్రామంలో రూట్ వాచ్ నిర్వహించి నూట పది లీటర్ల నాటుసారా ను దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామమునకు చెందిన ఇద్దరు యువకులు అక్రమంగా తరలిస్తున్న సారాను ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. మరియు దొండపూడి గ్రామం లో గ్రామ వాలంటీర్ల గ్రామ సచివాలయ మహిళా పోలీస్ మరియు ఎక్సైజ్ సిబ్బంది గ్రామ ప్రజలకు నాటుసారా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో నాటు సార విక్రయ కేంద్రాలు తెలుసుకొని సుమారు 30 లీటర్ల సారాను పట్టుకుని గ్రామ సచివాలయం ముందు నాశనం చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ అల్లూరయ్య, సచివాలయ మహిళా పోలీస్ సిహెచ్ లక్ష్మీ తులసి వాలంటీర్లు కొక్కిరపాటి శ్రీను, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment