"డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్" 129వ జయంతి వేడుకలు
ఎంవిపి కాలనీ, పెన్ పవర్ ప్రతినిధి మొహమ్మద్,
ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న" డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్" 129వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరమ్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆల్ ఇండియా దళిత రైట్ ఫోరమ్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనంద్ పిలుపుమేరకు విశాఖపట్నం జిల్లా కమిటీ మరియు సిటీ కమిటీ సంయుక్తంగా కైలాసపురం డి ఎల్ బి దగ్గర డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఉద్యానవనంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఏ ఐ ఆర్ ఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పట్టా రమేష్ బాబు అధ్యక్షతన సభ్యులు ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది ఏ ఐ డి ఆర్ ఎఫ్ సభ్యులు సిటీ అధ్యక్షులు జి శ్రీనివాస్, జిల్లా సెక్రెటరీ కోటేశ్వరరావు, ఈసీ రామచంద్రరావు, ఎస్ ప్రవీణ్ కుమార్, గాలి శ్రీను, కే రాము, ఎం రామకృష్ణ, పి. లింగమూర్తి, బిబి పడల్, గోవింద్, ఆర్ కృపానందం, డీజిమూర్తి, కొండలరావు, పొట్టి గణేష్, వై రామచంద్రరావు, రాజ్ కుమార్, పాల్గొన్నారు అనంతరం 200 మందికి పేదవారికి భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
No comments:
Post a Comment