Followers

1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ



1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

 

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి -  జడ్పీటీసీ ఎమ్. రవికుమార్ రెడ్డి

 

  వేంపల్లె/కడప జిల్లా, పెన్ పవర్ : జీవన్ 

 

 

మహమ్మారి కరోనా వైరస్ నివారణలో భాగంగా శుక్రవారం వేంపల్లెలోని బిడాలమిట్ట, కాలేజీ రోడ్డు ఉన్న పేద కుటుంబాలకు సుమారు 1200 కుటుంబాలకు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయున జడ్పీటీసీ ఎమ్. రవి కుమార్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ షబ్బీర్ వలీ మరియు ఎస్సై సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీటీసీ హబిబుల్లా (ఎమ్. హెచ్), మైనారిటీ కన్వీనర్ మునీర్ బాషా ,కటికచంద్ర తదితరులు ఇంటింటికీ వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎంపిటిసి హబిబుల్లా (ఎమ్.హెచ్) ను నాయకులు, ప్రజలు అభినందించారు. అలాగే తన సొంత ఆర్థిక సహాయంతో పేదలకు కూరగాయలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత పేద ప్రజలకు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్డయ్య, షాదిఖాన ప్రెసిడెంట్ బిఎస్ షేక్షావలి, ఎంపీటీసీ బాబా షరీఫ్, కెకె, భారతీ, రాఘవయ్య, లిమ్రా సభ్యులు మదార్ షా వలి, నాయబ్, బజాజ్ షోరూం అధినేత సమీర్, కాలేషా, అక్రం, ముస్తాక్, వాలంటీర్ పఠాన్ గౌస్ మరియు తదితర లిమ్రా సోషెటీ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...