108లో ఇంత మందా...!!
లాక్ డౌన్ ఉల్లంఘించిన వైద్య సిబ్బంది
సాంపిల్స్ సేకరణ కి తీసుకు వచ్చి..
తిరిగి 108లో 18 మందిని కిక్కిరిసినట్టు తరలించి..
చర్యలు తీసుకుంటాం: కలెక్టర్
ఆ పై దృశ్యాలను చూసారా.. రాష్ట్రంలో ఎక్కడా ఇంత వరకు ఇలాంటి చిత్రాలు చూసి ఉండరేమో.. అయితే విజయనగరం జిల్లా కేంద్ర హాస్పిటల్ వద్ద మంగళ వారం సాయంత్రం కనిపించిన ఈ దృశ్యం వెనుక కథ ఏందో కాస్తా చదవండి..”
(పెన్ పవర్ ప్రతినిధి-విజయనగరం)
రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన జిల్లాగా నిత్యం వార్తలకెక్కే విజయనగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. యావత్ ప్రపంచాన్ని కబళించేస్తున్న కరోనా మహమ్మారిని తమ దరిదాపుల్లోకి రాకుండా స్వీయ నియంత్రణ, వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తున్న జిల్లా ప్రజలు ఒక్క కరోనా పాజిటివ్ కేస్ కూడా నమోదు కాకుండా విజయనగరంను వార్తల్లో నిలిపారు. దేశంలో కరోనాహొ విజృంభనతో విధించిన జనతా కర్వ్యూ మొదలు నేటి లాక్ డౌన్ వరకు జిల్లా ప్రజానీకం ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తోంది. అయితే అక్కడక్కడ కొంత మంది ఆకతాయిలు లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై జిల్లా పోలీస్ శాఖ కేసులు నమోదు చేసి భారీగానే జరీమానాలు కూడా వసూళ్లు చేసింది. ఇప్పటి వరకులాక్ డౌన్ ఉల్లంఘన కింద జిల్లాలో 22 వేల వాహనాలకు రూ.కోటి 50 లక్షలు పెనాల్టీ వసూళ్లు చేసి,హొ 950 కేసులు నమోదు చేసి 558 వెహికల్స్ ని సీజ్ చేశారు. ఇవీ సామాన్యులపై పోలీస్ వారి చర్యలు. మరో వారం రోజులు పాటు మరింత కఠినంగాను వ్యవహరించనున్నారు. సరే ఇంత వరకు బాగానే ఉంది. ప్రజలహౌ క్షేమం కోసం ఇటువంటి కఠిన మైన చర్యలు తీసుకోవడం అభినందనీయమే. కానీ కొన్ని చోట్ల పోలీస్, అధికార యంత్రాంగం వారి పర్య వేక్షణ, విధి నిర్వహనలో అలసత్వం ఎలా ఉందో చెప్పడానికి పైన చూపుతున్న ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. కరోనా ఐసోలేషన్ కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ఎటువంటి భద్రత చర్యలు తీసుకోలేదని చాటి చెబుతున్న దృశ్యాలు అవి. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్య శాఖ సిబ్బందే లాక్ డౌన్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే ఇది తప్పు అని చెప్పే పర్య వేక్షణ అధికారి ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం అత్యంత శోచనీయం. కీలకమైన చోట ప్రజా భద్రతను గాలి కొదిలేసిన పరిస్థితి ఆసుపత్రి ప్రాంగణంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నెల్లిమర్ల మండలం సతివాడ పిహెచ్ సి పరిధిలో ఉన్న పరిసర గ్రామాలకు చెందిన సుమారు 18 మంది వలస కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇటీవల లాక్ డౌన్ అమలు సమయంలో స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. స్థానిక వాలేంటర్ల హొ సమాచారంతో వారందరిని కరోనా పరీక్షల నిమిత్తం సతివాడ పిహెచ్ సికి, అక్కడ నుంచి జిల్లా కేంద్రాసుపత్రి లోని ఐసోలేషన్ కేంద్రానికి వివిధ వాహనాల్లో తీసుకు వచ్చారు. అక్కడ వారి నమూనాలు సేకరించారు. అనంతరం వారందరినీ 108 వాహనంలో ఒకరి పై ఒకరు నొక్కుకుపోయి కూర్చుండేటట్లు కిక్కిరిసినట్టుగా ఎక్కించి అక్కడ నుంచి సతివాడకు తరలించారు. ఆ సమయంలో అక్కడ వైద్యాధికారులు గానీ, బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది గానీ లేరు. దీంతో అంత మందిని ఒకే వాహనంలోకి ఎక్కించి తరలించాలని 108 సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది ఎవరో, భద్రత దృష్ట్యాహొ అలా అందరినీ కిక్కిరిసి తీసుకు వెళ్లడం క్షేమం కాదని, అది లాక్ డౌన్ షరతుల ఉల్లంఘన కిందికి వస్తుందని 108 , వైద్య సిబ్బంది ఎందుకు హొ గ్రహించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ సమయంలో వారిని ఇళ్లకు చేర్చేందుకుహొ ప్రయివేట్ వాహనాలు లేని కారణంగానే 108 వాహనంలో తరలించారు అనుకుంటే, అంత మందిని ఒకే వాహనంలో కాకుండా అధికారులు మరి కొన్ని వాహనాలు లేదా ఒక ప్రత్యేక బస్సును గానీ ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. అంటే అధికారులు, వైద్య సిబ్బంది అంతా కలిసి నిర్ణయం తీసుకొనే ఇలా తరలించారని తెలుస్తోంది. మంగళవారం ఒక్క రోజే కాదు గత వారం పది రోజులగా ఎక్కువ శాంపిల్స్ సేకరణ మొదలు పెట్టిన నాటి నుంచి ఎక్కువ మంది అనుమానితులని 108 వాహనాలు ద్వారానే అధిక సంఖ్యలో తీసుకు వచ్చి తిరిగి అవే వాహనాల్లో వారిని ఇళ్లకు చేర్చుతున్నారని స్వయంగా 108 సిబ్బందే చెబుతున్నారు. అలా తాము తీసుకు వచ్చి, తిరిగి ఇళ్లకు చేర్చే వారెవ్వరికీ ఎటువంటి వైరస్ లక్షణాలు లేనందునే తాము అందరిని కలిపి ఒకే వాహనంలో తరలిస్తున్నామని సిబ్బంది సమర్ధించుకుంటున్నారు. బుధ వారం జరిగిన ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ కూడా ఇలాగే సమర్ధించారు. అలా ఒకే వాహనంలో కిక్కిరిసి తీసుకు వెళ్లిన వారెవ్వరికీ ఎటువంటి రోగ లక్షణాలు లేవని, భయపడాల్సిన అవసరం లేనందున అలా తీసుకు వెళ్లడం వల్ల ఏమీ జరగదని కలెక్టర్ పేర్కొనడం విశేషం. నిజానికి సాంపిల్స్ సేకరణకు తీసుకు వస్తున్న వారంతా అనుమానితులు. వీరంతా విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారు, వారి కాంటాక్ట్స్. వీరికి వ్యాధి లక్షణాలు లేవన్న ధీమాతో వారి నమూనాలు సేకరించకుండా ఇక్కడి యంత్రాంగం వారిని హెూమ్ క్వరంటైన్ లో ఉంచేసి తమ పనై పోయిందని ధీమా పడింది జిల్లా యంత్రాంగం. జిల్లా నుంచి ఒకటి అరాహొ నమూనాలు పంపించి పాజిటివ్ కేసులు లేవంటూ రోజూ చంకలు గుద్దుకునే పరిస్థితి ఉండేది. అయితే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు గట్టిగా హెచ్చరించిన నాటి నుంచి నిద్ర మేలుకున్న యంత్రాంగం ఈనెల 6 నుంచి పదుల సంఖ్యలో శాంపిల్స్ తీసి కరోనా పరీక్షలకు పంపిస్తోంది. అలా తీసి పంపిన శాంపిల్స్ రిపోర్ట్ రెండు మూడు రోజులకొకసారి వస్తున్నాయి. అలా ఇప్పటి వరకు జిల్లా నుంచి 794 మంది నమూనాలు సేకరించి పరీక్షలకి పంపగా 316 మంది నివేదికలు నెగెటివ్ వచ్చాయి. ఇంకా 478 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. అంటే ఈ 478 మంది అనుమానితులకి బాహ్యంగా వైరస్ వ్యాధి లక్షణాలు లేకపోయినా,హొ కరోనా పరీక్షల నివేదికల్లో నెగెటివ్ వస్తేనే వారు నూటికి నూరు శాతం సురక్షితులుగా భావించగలం. అంత వరకు వారిని ఇతరులు, వారు ఇతరులని తాకకుండా సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇదే లాక్ డౌన్ అమలు వెనుక అసలు ఉద్దేశ్యం. అయితే మంగళ వారం శాంపిల్స్ సేకరణ నిమిత్తం కేంద్ర హాస్పిటల్ కి తీసుకువచ్చిన సతివాడ పిహెచ్ సి పరిధిలోని అనుమానితులంతా ఈ క్రమంలోకే వస్తారు. అంటే ఒక రకంగా వీరంతా సురక్షితులు కాదు. వీరి పరీక్షల నివేదికల్లో నెగెటివ్ అని ఫలితం వచ్చే వరకు వీరంతా కరోనా అనుమానితులుగానే పరిగణించ బడతారు. మరి ఇటువంటి వారందరినీ 108 వాహనంలో కిక్కిరిసి ఎక్కించి మరీ తరలించారంటే అధికారులు తీరుని ఏమని ప్రశ్నించాలో అంతు చిక్కడం లేదు. వీరి రిపోర్ట్స్ రావడానికి ఇంకా నాలుగైదు రోజులు సమయం పట్టనుండగా వీరంతా సురక్షితులేనని వారిని తరలించిన 108 వాహన సిబ్బంది చెప్పినట్టు జిల్లా కలెక్టర్ పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా బుధ వారం ప్రెస్ మీట్ లో ఈ అంశంపై స్పందించిన కలెక్టర్ హరి జవహర్ లాల్ పై విధంగా పేర్కొంటూ, 108 వాహన సిబ్బంది చేసింది తప్పెనని ఒప్పుకున్నారు. ఇక పై అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సిబ్బంది, అధికారులకి గట్టి హెచ్చరికలు చేసినట్టు తెలిపారు.
No comments:
Post a Comment