Followers

తాటిపర్తి  చెట్టుపల్లి  రహదారి  విస్తరణకు  102 కోట్ల మంజూరు








  తాటిపర్తి   చెట్టుపల్లి  రహదారి  విస్తరణకు  102 కోట్ల మంజూరు.  ఆర్ అండ్ బి డిఈ  వేణుగోపాల్.

 


         వి. మాడుగుల ..పెన్ పవర్. : మజ్జి శ్రీనివాస మూర్తి 




 




నర్సీపట్నం  రోడ్లు భవనాల  శాఖ   డివిజన్ పరిధిలో  రెండు రహదారులు  విస్తరణకు  ప్రభుత్వం 102 కోట్ల రూపాయలు   మంజూరు చేసిందని  ఆర్ అండ్ బి  నర్సీపట్నం  డి ఈ  వేణుగోపాల్  తెలిపారు. ఆదివారం  ఆయన  మాట్లాడుతూ  చెట్టు పల్లి నుంచి   వడ్డాది జంక్షన్ వరకు  రోడ్డు విస్తరణకు  80 కోట్ల రూపాయలు  కేటాయించారని  తెలిపారు. అలాగే   వడ్డాది నుంచి  తాటిపర్తి  వరకు  రోడ్డు విస్తరణకు  22 కోట్ల రూపాయలు  కేటాయించారని తెలిపారు.18 అడుగులు  ఉన్న రహదారి  30 అడుగులకు పెంచడం జరుగుతుందన్నారు. తాటిపర్తి నుంచి  గరిక బంధ చెక్పోస్ట్ వరకు  గత ఏడాది  రోడ్డు విస్తరణ చేశామన్నారు. తాటిపర్తి  వడ్డాది   చెట్టు పల్లి వరకు   రోడ్డు విస్తరణ  చేపడతామన్నారు.  టెండరు నిర్వహించిన తర్వాత  పనులు ప్రారంభమవుతాయని  తెలిపారు.  ప్రస్తుతం  రహదారి  ఉన్న వెడల్పును  కొలతలు వేసి  గుర్తు ఇస్తున్నామని  తెలిపారు. అలాగే పాడేరు డివిజన్ లో  సుజన పేట రహదారి 5 కిలోమీటర్లు  కూడా  విస్తరిస్తున్నారు.

 





 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...