జిల్లాలో నాటుసారా పై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు
అనపర్తి పెన్ పవర్ : కొవ్వూరి నాగ శ్రీనివాస రెడ్డి
కోవిడ్ 19 లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం మరియు కల్లు అమ్మకాలపై నిషేదం విధించింది. దీని మూలంగా ఇతర మత్తు పదార్థాలు అనగా నాటు సారాయి, ఎన్. డి .పి. ఎల్ , గంజాయి మొదలగునవి పెరిగే అవకాశాలు ఉన్న దృశ్య జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ బి అరుణ రావు గారు, రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరిండెంట్ గారు శ్రీ కే.బి.ఎన్ ప్రభు కుమార్ వారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా 25 -4 -2020 రాజమహేంద్రవరం ఎక్సైజ్ యూనిట్ నందు వివిధ ప్రాంతాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సారా తయారీ కేంద్రాలు మరియు రవాణా చేయు వాహనములు మరియు సారాయి అమ్మకాలు జరుపు ప్రాంతాలలో దాడులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముక్కినాడ పాకలు గ్రామం లో రాయవరం ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఎన్ ఎస్ వేణుమాధవ్ వారి సిబ్బంది రాజమండ్రి సౌత్ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు దాడులు నిర్వహించి 600 లీటర్ల బెల్లపు ఊ ట ను ధ్వంసం చేసినారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి అనగా 22. 03.2020 నుండి 24.04.2020 వరకు రాయవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం ఆరు కేసులు నమోదు చేసి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి నలభై ఐదు లీటర్ల సారాయిని మరియు 15 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే నాటు సారాయి గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల పై సమాచారం ఉన్న ఎడల సీఐ 9440902413 si 9030737532 నెంబర్ లకు సమాచారము ఇవ్వవలసిందిగా సమాచారం ఇచ్చిన వారి వివరములు గోప్యంగా ఉంచబడతాయి రాయవరం ఎక్సైజ్ శాఖ తెలిపింది.
No comments:
Post a Comment