విపత్తుల ప్రత్యేక నిధులు వినియోగించేలా చూడాలి
జనసేన నియోజకవర్గ నాయకు రాజాన వీరసూర్యచంద్ర
నర్సీపట్నం, పెన్ పవర్ ప్రతినిధి శివ
ఇటీవలే విడుదల చేసిన విపత్తుల ప్రత్యేక నిధులు నర్సీపట్నం మున్సిపాలిటీలో సక్రమంగా వినియోగించేలా చూడాలని నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు రాజాన వీరసూర్యచంద్ర బుధవారం నర్సీపట్నం ఆర్డీవో కె. లక్ష్మీశివజ్యోతిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో కూడా సక్రమంగా కాలువలు శుభ్రపరచడం, క్లోరినేషన్ కీటకనాశిని ద్రావకం పిచికారీ చేయడం, మాస్క్‌ు పంపిణీ చేయడం జరగలేదన్నారు. అలాగే వైద్య సిబ్బంది అందరికి పిపిఈ సూట్స్ అందించడం, 108 వాహనాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఏరియా ఆసుపత్రిలో సక్రమంగా మందులు ఉండేలా చూడటం, మున్సిపాలిటీలో కరోనా వైరస్ ప్రభావంతో అనుమానితులు ఎవరైనా ఉంటే గుర్తించడం కేసు వచ్చిన పరిసరాలలో పూర్తిగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం లాంటి విషయాలపై దృష్టి పెట్టాలని కోరడం జరిగిందన్నారు. దీనిపై ఆర్డీవో సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శివనారాయణరాజు, జనసేన నాయకులు అద్దేపల్లి గణేష్, పంచాడ హరినాథ్ తదితయి పాల్గొన్నారు.
No comments:
Post a Comment