Followers

నిత్యావసరాలు  పంపిణీ


నిత్యావసరాలు  పంపిణీ



  విజయనగరం/ మెంటాడ, పెన్‌ పవర్‌ ప్రతినిధి సత్యం 



మెంటాడ మండలం  లోని బుధవారం  మెంటాడ మాజీ పిఎసిఎస్‌ అధ్యక్షు గొర్లె ముస్లి నాయుడు (టిడిపి) ఆధ్వర్యంలో సారాడ వలస, మల్లె డ వలస గిరిజన గ్రామాల్లో సుమారు వంద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. మెంటాడ మండలం  టిడిపి అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు ఆధ్వర్యంలో గుర్ల తమ్మీ రాజుపేట గ్రామంలో  సుమారు 1000 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులను అందజేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో అంచెంలంచెలుగా  నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు మండల  టిడిపి అధ్యక్షులు  వెంకట్రావు తెలిపారు.  కరోనా కర్ఫ్యూ కారణంగా ప్రజులు  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజులు అత్యవసరమైతే తప్ప, మిగతా సమయాల్లో బయటకు రావద్దని, తమ పిల్లలను ఇంట్లోనే  ఉండేవిధంగా పిల్లలకు  తల్లిదండ్రులు  అవగాహన కల్పించడం ద్వారా కరోనా వైరస్‌ కట్టడి చేయవచ్చని టిడిపి నేతలు  సూచించారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...