ప్రజల కోసం ఎంపీ సత్యవతి మృత్యుంజయ హోమం
అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్
ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి విష్ణుమూర్తి దంపతులు శనివారం మహాగణపతి మృత్యుంజయ హోమం నిర్వహించారు. వేద పండితులతో వినాయకుని ఆలయం ముందు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా వ్యాధిని బారిన పడకుండా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం పేదలకు వివేకనంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు వంట సరుకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment