మాస్క్ ధారణను చట్టం చేయాల్సిందే
-- లేకుంటే కరోనా ముప్పు తప్పదంటున్న విశ్లేషకులు
అనకాపల్లి , పెన్ పవర్ ప్రతినిధి : వానపల్లి రమణ
మాస్క్ ఇప్పుడు మన జీవితంలో కీలకంగా మారింది అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచాన్ని పట్టిపడిస్తున్న కరోనా నుంచి కాస్తయినా తప్పించుకోవాలంటే మాస్క్ తప్పనిసరి అనేది ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. అయితే ఎంత చెప్పినా పెడచెవిన పెట్టే జనం క్షేత్రస్థాయిలో ఉంటారనేది జగమెరిగిన సత్యం. వ్యక్తిగత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే మాస్క్ దారణను చట్టంగా చేయాల్సిందే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి సాధారణ పరిస్థితుల్లో కూడా మాస్క్ ఎంతో ఉపకారంగా నిలుస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నా శ్వాసకోస వంటి ఇబ్బందులు ఉన్నా రక్షణ కల్పించడంతో పాటు ఇతరులు ఇబ్బంది పడకుండా ఉపకరిస్తుంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దాని ఉపయోగం తప్పనిసరి అయింది.
కరోనా వ్యాధి ఒక మనిషి నుండి ఒక మనిషికి సంక్రమిస్తుంది తెలిసిందే. దీనిలో ప్రధానంగా లాలాజలం తో ఇతరులకు వ్యాపిస్తుంది అని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆదేశిస్తునే ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మాస్కులు లేకుండా బయటకు వస్తే కేసు నమోదు చేయాలని నిర్ణయించాయి. అయితే ఏం చెప్పినా వినిపించుకోని జనం క్షేత్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కోసమే కాబట్టి మాస్క్ ధరించడం చట్టంగా చేస్తే బాగుంటుందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వ్యాధి ఇప్పటిదో తప్పే సమస్య కాదు. వ్యాక్సిన్ వచ్చే వరకూ ఈ సమస్య ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో జనం ప్రయాణ సమయంలో రద్దీగా ఉన్న సమయంలో ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంది. దీంతో ఇంటి నుండి బయటకు వస్తే మాస్కు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పక్కాగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటే చట్టంగా చేయాల్సిందే. ఈ వ్యాధి అనే కాకుండా అనేక విధాలుగా జనాలకు మాస్క్ ఉపయోగ పడే అవకాశాలు ఉన్నాయి.
No comments:
Post a Comment