Followers

రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ నివాస్


రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ నివాస్

 

శ్రీకాకుళం, పెన్ పవర్ 

 

జిల్లాలో రక్త యూనిట్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో రక్త నిల్వలు తగ్గిపోవడం కొంత ఆందోళన కలిగించే విషయమం. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి ఛాయలు కనిపించకపోవడం సంతోషించదగిన విషయమే అయినప్పటికి ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రక్త నిల్వలపై కూడా దృష్టి సారించారు జిల్లా కలెక్టర్ జె నివాస్. జిల్లాలో ప్రస్తుతం కేవలం 38 యూనిట్ల రక్త నిల్వలు ఉండటం వలన అత్యవసర పరిస్ధితిలో సరఫరా లేక ఇబ్బందులు ఎదురు అవుతాయని నేను సైతం అంటూ స్వయంగా రంగంలోకి దిగి రక్తదానానికి ముందుకు వచ్చారు నివాస్. కరోనా వ్యాప్తి నివారణ కార్యక్రమంలో ప్రణాళికలు సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్నప్పటికి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కర్తవ్య నిర్వహణకు పూనుకున్నారు.  మంగళ వారం సాయంత్రం రెడ్ క్రాస్ రక్త సేకరణ కేంద్రానికి నేరుగా వచ్చి రక్త దానం నిర్వహించి ఆదర్శప్రాయంగా నిలిచారు. జిల్లాలో రక్త నిల్వలు తగ్గుముఖం పట్టడం జరుగుతోందని కలెక్టర్ నివాస్ అన్నారు. రక్త నిల్వలు పెంచాలని పిలుపునిచ్చారు. రోజు వారీ వైద్య చికిత్సల కార్యక్రమానికి కూడా కొరత ఏర్పడటం వలన ప్రాణాలు కాపాడుకోలేని అవకాశం ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో భాగంగా రక్త నిల్వలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రతి రోజు ఉద్యోగులు రక్త దానం చేయుటకు చర్యలు చేపడతామని అన్నారు. ఈ మేరకు అన్ని శాఖలకు సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. 

మేము సైతం :  జిల్లా కలెక్టర్ స్వయంగా రక్తదానం చేయడంతో మేము సైతం అంటూ జర్నలిస్టుల తరపున జెకెసి సీనియర్ పాత్రికేయులు ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి రక్తదానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు.  గుడ్ ఫ్రైడే ఇంటి వద్దనే : గుడ్ ఫ్రైడ్ ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని జిల్లాకలెక్టర్ పిలుపునిచ్చారు. చర్చిలకు వెళ్ళ వద్దని, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన కోరారు. ఇటీవల ఉగాది, శ్రీరామ నవమి అందరూ ఇళ్ళ వద్దనే నిర్వహించుకున్నారని అదేవిధంగా గుడ్ ఫ్రైడేను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ ఉందని, 144వ సెక్షన్ అమలులో ఉందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఇళ్ళలోనే ఉండాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు. 

అనంతరం పేదలకు రెడ్ క్రాస్ సంస్ధ తరపున నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, రెడ్ క్రాస్ సభ్యులు గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...