Followers

స్లీపింగ్ సెల్స్ అనే మాటను జైల్లో మోపిదేవికి టెర్రరిస్టులు నేర్పి ఉంటారు.


స్లీపింగ్ సెల్స్ అనే మాటను జైల్లో మోపిదేవికి టెర్రరిస్టులు నేర్పి ఉంటారు.


   న్యూస్ డెస్క్,  పెన్ పవర్ 


ఆంధ్ర రాష్ట్రంలో కరోన వ్యాప్తికి టిడిపి కార్యకర్తలు స్లీపింగ్ సెల్స్ గా మారి ఉంటారని మోపిదేవి అన్నాడంటే, ఆ పదాన్ని మోపిదేవికి జైల్లో టెర్రరిస్టులు నేర్పి ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు.



స్లీపింగ్ సెల్స్ అనే పదం టెర్రరిస్టులు, ఆత్మాహుతి దళాలు, ఆర్థిక నేరస్థులు, సంఘ విద్రోహులు మాట్లాడతారని,అమలుచేస్తారని, వీరందరూ జైల్లోనే కలుస్తారని మాణిక్యరావు అన్నారు. వై.యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఆర్థిక నేరాలకు పాల్పడి, జైలుకు వెళ్లిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసునని ఆయన గుర్తు చేశారు. జైల్లో ఎలాంటి వారు ఉంటారో ప్రజలందరికీ తెలుసునని, అక్కడ ఆర్థిక నేరస్థులు, టెర్రరిస్టులు, రేపిస్టులు, దోపిడీ గాళ్లు, ఉగ్రవాదులు, మొదలైన నేరస్థులందరు జైల్లోనే ఉంటారు కాబట్టి, మోపిదేవి జైల్లో ఉన్న సందర్భంగా వాళ్లతో స్నేహం ఏర్పడి ఉంటుంది కాబట్టే నేర పరిభాష, నేర పరిజ్ఞానం నేర్చుకుని ఉంటాడని, ఈ సందర్భంగా ఆయన వాడిన భాషను బట్టి మనకు అర్థమవుతుందని పిల్లి మాణిక్యరావు అన్నారు.


టెర్రరిస్టులు సమాజంపై కక్ష తీర్చుకోవడానికి సామాన్య ప్రజల లమాదిరిగానే ఉండే కొంతమంది టెర్రరిస్టులను సమాజంలోకి ప్రజలమధ్యకు, పంపడాన్ని "స్లీపింగ్ సెల్స్" అంటారనేది నిన్న మోపిదేవి ఆ పదం వాడిన తర్వాత ప్రజలకు అర్థం అయిందని , మాణిక్య రావు అన్నారు. కాబట్టి మోపిదేవి దగ్గర ఇంకా ఎన్ని నేర విద్యలు ఉన్నాయో, భవిష్యత్తులో వారు వాడే పదాలను బట్టి,వారు చేసే పనులను బట్టి, ప్రజలకు అర్థం అవుతుందని ఆయన అన్నారు.


ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు,ఎం.పీ.లు కరోన వ్యాప్తి చేయడం వెనుక ఏదో జైలు వ్యూహం ఉండే ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ వై.సి.పి నేర బృందం యొక్క వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, నేరపూరిత ఆలోచనలు, రెచ్చగొట్టే పదాలు వాడటం చాలా ప్రమాదకరమని, వీరి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...