15 మందికి కరోనా లక్షణాల అనుమానం.
అన్నవరం క్వారంటైన్ కు తరలింపు.
ఏలేశ్వరం, పెన్ పవర్
ప్రత్తిపాడు మండలం గ్రామంలో కరోనా మహమ్మారి జడలు విప్పుతున్న జాడలు కనిపిస్తున్నాయి. ఒకేసారి గ్రామంలో లో 15 మంది కి జ్వరాలు, గొంతు నొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానికులు అధికారులకు తెలియ పరచడంతో అప్రమత్తమైన అధికారులు ఏలేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రోగులను అన్నవరం కొండ పై గల క్వారంటీన్ కు తరలించారు. దీంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏలేశ్వరం కి చెందిన సుజన స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కే రాజేంద్ర కు అందిన సమాచారం మేరకు ఈ గ్రామానికి ఈనెల 22వ తేదీన మసీదుకు ఢిల్లీకి చెందిన ముస్లిం పెద్ద వచ్చి మసీదులో సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి 150 కుటుంబాలకు చెందిన సుమారు 30 మంది గ్రామస్తులు హాజరైనట్లు తెలిసింది. దీంతో అధికారులకు తెలియపరచడం తో ఏలేశ్వరం మండలం తాసిల్దార్ ఎం రజిని కుమారి ఆదేశాల మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ హెచ్ అమరసింహుడు డిపో నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఒమ్మంగి గ్రామానికి సోమవారం సాయంత్రం పంపించారు. ఒమ్మంగి నుండి బాధితులను అన్నవరం క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment