స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం ( పెన్ పవర్)
నగరంలోని అల్లి పురానికి చెందిన సత్తార్ అనే వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో ఛాతీ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. శుక్రవారం ఆయన అధికారికంగా సత్తార్ బ్రతికే ఉన్నాడని అధికారికంగా బులెటిన్ విడుదల చేశారు. పురానికి చెందిన సత్తార్ కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వదంతులు వినిపిస్తున్నాయి. వాట్సాప్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో విశాఖపట్నం కరోనా బూచి తో అట్టుడికిపోతోంది. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కరోనా ప్రభావం ఏకంగా విశాఖను కమ్మేసింది అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలన్న ఎవరితో మాట్లాడాలన్నా సాహసం చేయలేక పోతున్నారు. ప్రజల దుస్థితి చూసి అధికారులు అప్రమత్తమయ్యారు. సత్తార్ కు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య సేవలు అందిస్తున్నారని అతను ప్రాణాలతో ఉన్నాడని వస్తున్న వదంతులు అవాస్తవమని కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇతర యంత్రాంగం కరోనా మహమ్మారిపై దండె త్తుతున్నా రు. సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అధికారులను కోరారు.
No comments:
Post a Comment