Followers

తిన్నింటివాసాలు లెక్కించిన రాయవరం ఎక్సైజ్ సిఐ రెడ్డి త్రినాథ్


 


 


 రూ.2 లక్షల అక్రమ మద్యాన్ని పట్టుకున్న స్థానికులు


అన్నం పెట్టే ప్రభుత్వానికి కన్నం లక్షల్లో సొమ్ము చేసుకున్న వైనం


సిఐ ఆదేశాలతో తరలిస్తున్నామన్న షాపు సూపర్వైజర్


ధర్నాకు దిగిన వైసీపీ నేతలు


గతంలోనే సిఐ వ్యవహారంపై పెనపవర్ లో కథనం


ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పణ


సిఐని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి


(పెన్ పవర్, అనపర్తి)


తిన్నింటి వాసాలు లెక్కించే వారిని చాలా అరుదుగా మనం చూస్తుంటాం. అలాంటి సంఘటన జిల్లాలోని అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని మారుతీనగర్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. అక్రమంగా సుమారు లక్ష రూపాయల మద్యాన్ని, రాయవరం ఎక్సైజ్ సిఐ ఆదేశాలతో  తరలిస్తున్న కార్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఒక్క సారిగా సిఐ రెడ్డి త్రినాథ్ భాగోతం వెలుగుచూసింది. మద్యం అక్ర్రమంగా తప్పిస్తున్న కార్లలో సుమారు రూ.2 లక్ష మేర సరుకు ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవవద్దని గట్టి సూచనలు చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇలంటి అక్రమ అధికారులతో... నిజాయతీగా పని చేసే అధికారులు సైతం ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చిన యజమానికి కన్నం వేయాలంటే సవా లక్ష ఆలోచిస్తారు. కాని మన సిఐ మాత్రం తనకు అన్నం పెట్టి, ఉద్యోగం చూపిన ప్రభుత్వానికే కన్నం వేసేందుకు నడుం బిగించారు. తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయల మద్యాన్ని తన స్నేహితుల ద్వారా బయటకు తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు. ఈ భాగోతం గత వారం రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే గ్రామస్థులు పక్కా సమాచారంతో పట్టుకుని అటు ఉన్నతాధికారులకు, ఇటు స్థానిక శాసనసభ్యులు కు సమాచారం చేరవేశారు. దీంతో ఉన్నతాధికారులు వచ్చే లోపుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియా కూడా ఒక్క సారిగా అక్కడకు చేరుకోవడంతో తప్పించుకోవాలనుకున్న సిఐ పీకల్లోతు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. పట్టుపడ్డ షాపు సూపర్ వైజర్ లు కూడా తమకే పాపం తెలియదని, సిఐ ఆదేశించడంతోనే తాము ఈ సరుకు అంతా బయటకు తరలిస్తున్నామని మీడియా ముందు వివరించారు. గతంలో పెన పవర్ దిన పత్రికలో సైతం సిఐ వ్యవహారాలపై పలు కథనాలు ప్రచురించాము. ఆ సమయంలో ఏకంగా మీడియాపైనే ఆయన తప్పుడు నివేదికలు ఉన్నతాధికారులకు అందజేశారు. గ్రామంలోని వైసీపీ నాయకులు రోడ్డుపైకి చేరి ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఉన్నతాధికారులకు ఆయన అక్కడ నుంచే ఫోన్ చేసి వెంటనే రాయవరం సిఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వాస్తవానికి గత వారం రోజులుగా ఆయన పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను ఉన్నతాధికారులు ఒక సారి పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలకు లక్షలు అక్రమంగా సిఐ సంపాదించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సిఐ పై చర్యలు తీసుకోవడంతో పాటు షాపులు మూసివేసిన రోజు నుంచి నేటి వరకు ఆయన పరిధిలోని షాపుల్లోని సరుకును ఒక సారి తనిఖీ చేస్తే మరిన్ని వాస్తవాలు తెలియవచ్చు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...