Followers

  ఇటలీ రాజధాని రోమ్  లో చిక్కుకున్న తెలుగు వారిని భారత్ రప్పించండి

 


-      విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వినతి


-      ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ తో భేటీ


 



 


   విశాఖపట్నం,  పెన్ పవర్ : ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 70 మందిని తిరిగి  స్వదేశానికి తిరిగి రప్పించాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ లో ఆయన  కార్యాలయానికి చేరుకుని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సంధర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ ఇటలీ రాజధాని రోమ్ లో చిక్కుకున్న 70 మంది తెలుగు వారిని స్వస్థలాలకు రప్పించాలని కోరామన్నారు. ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రాన్ని జై శంకర్ కు అందజేశామన్నారు.  కరోన వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం విజృంభిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన 70 మంది అక్కడ  చిక్కుకున్నారని. ఈ నేపధ్యంలో వారి తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.  ప్రముఖంగా అక్కడ విశాఖనగరానికి చెందిన ఇద్దరు ఆ సమూహంలో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. భాదితుల తల్లితండ్రులు తనను కలిసి , ఈ విషయం పై ఆవేదన వెలిబుచ్చి, తగు న్యాయం చేయాలని కోరారన్నారు. ఈ క్రమంలో రోమ్  నగర ఎయిర్పోర్టు లో  సహాయార్ద్ధులై వేచి ఉన్న వారిని , తిరిగి రప్పించేందుకు చొరవ చూపాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిని కలిసి విన్నవించామన్నారు. స్పందించిన ఆ శాఖా మంత్రి ఆ దేశ ఎంబసీ తో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకుని , తగు న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేస్తామని హామీనిచ్చామన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...