Followers

దేవుడిచ్చిన శక్తితోనే మనం ఏదైనా అనుకుంటే సాధించగలం..కురసాల సత్యనారాయణ


 

 స్టాఫ్ రిపోర్టర్ కాకినాడ, పెన్ పవర్ 

 

 కేవలం దేవుని కృప,దయ తోనే మన మనుగడ,మనం అనుకున్నది సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసల కన్నబాబు తండ్రి సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు కురసాల సత్యనారాయణ అన్నారు. తిమ్మాపురం గ్రామం లోని మన్నా చర్చ్  పునః ప్రారంభం సందర్భంగా కురసాల సత్యనారాయణ  ప్రార్థన మందిరానికి విచ్చేసి సంఘ సభ్యులకు తమ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా మన్నా చర్చ్ సంఘ సభ్యులు కురసాల సత్యనారాయణ ను దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం  కలిగి ఉన్నప్పుడు మనం కోరుకున్నది నెరవేరుతుందని, ఆ విధంగానే చర్చి పునః ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. మన్నా మినిస్ట్రీస్ కార్యదర్శి రెవరెండ్ కార్ల్ డి. కోమనపల్లి మాట్లాడుతూ... దేవుని పై ఉన్న విశ్వాసం తో సువార్త చేపట్టి ఎన్నో కష్టాలని ఎదుర్కొని అనాడు పూరి పాకలో సువార్త చేపట్టిన  దేవుని కృప తో అంచెలంచెలుగా ఎదిగి నేడు పరిశుద్ధ మందిరాన్ని నిర్మించుకున్న మన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బెజవాడ సత్యనారాయణ, కరీం భాష, కర్రీ చక్రధర్, వైయస్సార్ రాజు, ముద్దన వెంకటరాజు,  సంఘ కాపరి డేవిడ్ కుమార్, ఎలీషా రాజు, బెన్ని బాబు, విజయ్ కుమార్,మాదారపు తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...