ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి
మండల అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్
రావులపాలెం,పెన్ పవర్
ప్రతి ఒక్కరూ వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిశరాలను పరిశుభ్రంగా ఉంచాలని మండల అభివృద్ధి అధికారి జి.రాజేంద్రప్రసాద్ కోరారు. ఆధివారం మండలంలోని రావులపాలెం, ఊబలంక , పొడగట్లపల్లి, ఈతకోట, దేవరపల్లి,వెదిరేశ్వరం గ్రామాలలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి ఆయా గ్రామాల కార్యదర్శులకు, పారిశుధ్య కార్మికులకు తగు సూచనలు చేసారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాల్ని పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయలని కోరారు. ఈసందర్భంగా ఎంపిడిఓ రాజేంద్రప్రసాద్, ఈఓపిఆర్డీ గంగుల కృష్ణలు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తూ అందర్నీ వణికిస్తున్న మహ్మమారి కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ పాటించాలని కోరారు. వైరస్ విజృంభిస్తున్న కారణంగా మనమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. మహమ్మారి నియంత్రణ కోసం బాధ్యతగా వ్యవహరించాలని,రోడ్లపై తిరగటం నిషేధించడం జరిగినందున ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించి తీరాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం లో మండలంలోని గ్రామ వాలంటరీలకు ,వైధ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ, సచివాలయం సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిమ్మకాయల సాయిరామ్, మహ్మద్ అన్వర్, కె.వి.వి సత్యనారాయణ, యల్. వి. దుర్గాప్రసాద్, ఎమ్. సాయి పట్టాభిరామయ్య, నిమ్మకాయల బ్రహ్మజీ, పి.ఫణి,బి.వి.ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment