పట్టుబడిన అంతర్ రాష్ట్ర గజ దొంగలు
పెన్ పవర్, జమ్మలమడుగు
స్థానిక జమ్మలమడుగు డిఎస్పీ ఆఫిసు లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు..ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం 12.30నిముషాల సమయంలో ప్రొద్దుటూరు మరియు తాడిపత్రి జాతీయ రహదారిలో జమ్మలమడుగు బై పాస్ రోడ్డు వద్ద ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో 7 మంది యువకులు మూడు మోటార్ సైకిళ్ల మీద రావడంతో అనుమానం తో వారిని పట్టుకుని విచారించిగా వారిపై కడప, కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన పోలీసు స్టేషన్ లు అయిన జమ్మలమడుగు అర్భన్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు, ముద్దనూర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, కలమల్ల పోలీస్ స్టేషన్లో 1 కేసు, ప్రొద్దుటూరు 1 మరియు 3 టౌన్ పరిధిలో ఒక్కోక్క కేసు, మైదుకూరు, బి మఠం లో 2 కేసులు, ఖాజిపేట లో 1 కేసు,రాజుపాలెం లో 2 కేసులు, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ లో 1 కేసు ,చాగలమర్రి లో 3 ఇలా సుమారు 24 కేసులలో వీళ్ళు చోరీలు చేసినందుకు కేసులు నమోదయ్యాయి అని ఒప్పుకున్నారు అని చెప్పారు, వీరు ప్రధానంగా ఒంటరిగా ఉన్న ఇల్లు, మహిళల పై దాడి చేసి ఛోరిలు చేసేవారు అని ,వీరి వద్ద నుండి 173 గ్రాముల బంగారు ఆభరణాలు(విలువ సుమారు 7,10,000) నగదు 48,500 రూపాయలు ,మూడు మోటార్ సైకిల్ వాహనాలను,8 సెల్ ఫోన్ లను పంచనామా ద్వారా స్వాధీనం చేసుకుని సాయంత్రం 4.30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పారు, ఈ ముఠా ను పట్టుకోవడం లో కీలకపాత్ర పోషించిన జమ్మలమడుగు సిఐ మధుసూదన రావు గారు, ఎస్సైలు రంగారావు, రవి కుమార్ మరియు ట్రైనింగ్ డిఎస్పీ శ్రీపాద రావు సిబ్బంది గురుశేఖర్ ,రామాంజనేయులు, మధుసూదన్ రెడ్డి,ఈ అరెస్ట్, విచారణ అంతా జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగింది,పట్టుకున్న ముద్దాయిలను రిమాండ్ రిపోర్టు తో కోర్టు కు పంపడమైంది.ఈ ముఠా ను పట్టుకున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి రివార్డులు అందజేస్తామని డిఎస్పీ గారు తెలిపారు..
No comments:
Post a Comment