పోలవరం, పెన్ పవర్ : ఇంటికి వేసిన తాళాలు వేసినట్లే ఉంది బీరువా కి వేసిన తాళం వేసినట్లే ఉంది బీరువా తాళం పెట్టి చోటే ఉంది కానీ బీరువాలో దాచిన 95 కాసుల బంగారం, 60 వేల రూపాయల నగదు. మాయమైన సంఘటన పోలవరం గ్రామం లో చోటుచేసుకుంది. పట్టపగలే దోచుకెళ్లారు ఘరానా దొంగలు. పోలవరం మండల కేంద్రంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం లోపు జరిగిన ఈ భారీ దొంగతనం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మెయిన్ బజార్లో ఐరన్ హార్డ్వేర్ షాపు నిర్వహిస్తున్న సింహాద్రి వెంకట సత్య శ్రీనివాస్ తన నివాసానికి అతి చేరువలో ఉన్న హార్డ్వేర్ షాపులో తన కుమారుడితో కలిసి వ్యాపారం చూసుకుంటున్నాడు. తన భార్య బంధువుల ఇంటికి పొరుగూరు వెల్లింది. కుమార్తె కళాశాలకు వెళ్లింది. అదే అదనుగా భావించిన దొంగలు వెనుక మార్గం గుండా ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో బంగారం, నగదు దోచుకెల్లారు. రాత్రికి ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ కుటుంబం చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలవరం డి ఎస్పి ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఆర్ శ్రీనులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ని రప్పించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment