- ఎన్నికల వాయిదాపై పెదవి విరుపు
- అన్ని వర్గాల కార్యకర్తల్లో అధిక భావన
అనకాపల్లి పెన్ పవర్ : స్థానిక ఎన్నికలు జరిగిపోతెేనే బాగు. ఇప్పటికిప్పుడు వాయిదాతో ఏమి లాభం. ఇది క్షేత్రస్థాయిలో అధిక వర్గాల మాట. దీనికి భిన్నంగా నాయకుల స్థానాల్లో ఉన్నవారు మాత్రం వాయిదానే సరైంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఆయా పార్టీల క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎన్నికలకు సానుకూలత కనబరుస్తుంటే నాయకులు మాత్రం భిన్న స్వరాన్ని వినిపించడంతొో అంతా అయోమయంగా మారుతోంది. నిజానికి స్థానిక ఎన్నికల వాయిదాలో శాస్ర్తియత లేదనేది అధికార పార్టీ వాదన. క్షేత్ర స్థాయిలో కూడా అదే వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు తమ పబ్బాన్ని గడుపుకునేందుకు ఎన్నికలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరుపై పెదవి విరిచేవారు లేకపోలేదు. ఎన్నికల అధికారికి అధికారం ఉన్నదన్నట్లు కాకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం హేతుబద్ధంగా లేదనేది వాదన. కరోనా ప్రభావం చెప్పుకునే స్థాయిలో కూడా లేకపోయినా తమ రాజకీయ ఉనికి కోసం కరొనా ప్రభావాన్ని ఊహించని స్థాయిగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుఉండటం ఇబ్బందిగా నిలుస్తోంది.
ఇదంతా ఒకెత్తైతే వారం రోజుల్లో ముగిసిపోయే ఎన్నికలు జరిగిపోతే బాగున్ను అనే భావన అధిక స్థాయిలో లేకపోలేదు. స్థానిక ఎన్నికల తోనైనా తమకు పదవి లభిస్తుందని ఆశించిన వారు ఎంతో ముందున్నారు. అధికార పార్టీలే కాదు ప్రతిపక్షాల్లో కూడా అనేక మంది క్షేత్రస్థాయి నాయకులు గెలిస్తే పదవితో ప్రజలకు సేవ చేయొచ్చుని తపించేవారు ఎక్కువే. గత తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా పెద్దగా ఇవ్వలేదు. దీంతో పదవుల కోసం అరులు చాచుకుంటూ నిరీక్షించిన నేతలకు ఎండమావే మిగిలింది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో నైనా విజయం సాధించి ప్రజా జీవితంలో నిలుద్దాం అనుకున్న వారికి గండి పడినట్లయింది. దీంతో అంతా పది రోజుల్లో ముగిసిపోయే తంతుకు ఎందుకింత అడ్డగింత అనే వాదన లేకపోలేదు. విజయమో వీరస్వర్గమో తేల్చేసుకుందుము కదా అనుకునేవారు ఎక్కువగా ఉన్నారు.
No comments:
Post a Comment