అనకాపల్లి, పెన్ పవర్
ప్రజా సంక్షేమం కోసం భారత ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు 22 న జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్య నారాయణ కోరారు. పార్టీ నాయకులతో కలిసి శనివారం పట్టణంలో జనతా కర్ఫ్యూ కు సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విచ్ఛినం చేస్తుందన్నారు. వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునిచ్చారన్నారు. ప్రతి ఒక్కరు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లు విడిచి బయటకు రాకూడదన్నారు. జనతా కర్ఫ్యూ సంబంధించి ప్రచార పత్రాలను ప్రతి షాపుకి పంపిణీ చేశారు. అనకాపల్లి అసెంబ్లీ కన్వీనర్ నాయుడు , జిల్లా ప్రధాన కార్యదర్శి కొణతాల అప్పలరాజు, పట్టణ కమిటీ కార్యదర్శి కర్రి రామకృష్ణ , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండబాబు , బండారు వెంకటేశ్వర్లు, వుడా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Followers
ప్రజా సంక్షేమం కోసమే జనతా కర్ఫ్యూ
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment