Followers

గిరిజనుల జంట హత్యలకు దారితీసిన  చిరు వివాదం.


    వేర్ల మామిడిలో  అలుముకున్న  విషాద ఛాయలు.
(స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్) 


విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం  వేర్ల మామిడి  గ్రామంలో  బుధవారం  జరిగిన  జంట హత్యలు  కలకలం రేపుతున్నాయి.  ఈ సంఘటనలో ఊలంగి సూరిబాబు (42) రాడా  చైతన్య(28) లు  దారుణ హత్యకు గురయ్యారు. ఒక శుభకార్యంలో  తలెత్తిన  చిన్నపాటి వివాదం  రెండు నిండు ప్రాణాలను బలి  తీసుకుంది. స్థానికులు పోలీసుల  కథనం ప్రకారం  భార్యా భర్తల మధ్య  తలెత్తిన ఘర్షణను  వారించిన  సంఘటన లో  ఈ జంట హత్యలుకు  దారి తీసింది.  వివరాల్లోకి వెళితే  వేర్ల మామిడి గ్రామానికి చెందిన ఊలంగి  సూరిబాబు  బుధవారం తన కుమార్తె వాణి ఫంక్షన్  నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గిరిజన యువతులు  సాంప్రదాయ నృత్యం ధింసాను  ఆడారు. ఈ శుభకార్యంలో  పాల్గొన్న   రాడా చైతన్య  దింసా ఆడుతున్న  భార్యతొ  ఘర్షణ పడ్డాడు. ఇది గమనించిన  సూరిబాబు  శుభకార్యంలో భార్యాభర్తల గొడవ ఎందుకని  సర్దుబాటు చెప్పే ప్రయత్నం చేశాడు.  ఇది  జీర్ణించుకోలేని  చైతన్య  సూరిబాబు తో  ఘర్షణ పడ్డాడు   మాటా మాటా పెరగడంతో  ఆగ్రహించిన చైతన్య  పంచ కు వేలాడుతున్న గొడ్డలి   తీసి   సూరి బాబు ఛాతీపై  బలంగా నరికాడు  నేలపై పడడంతో  మరో వేటు వేశాడు దీంతో  సూరిబాబు అక్కడికక్కడే చనిపోయాడు.  ఇది గమనించిన  చైతన్య    తప్పించు కొని పారిపోతుండగా  సూరిబాబు కుటుంబీకులు  వెంటాడి మరీ  చైతన్య పట్టుకొని  తాళ్లతో కట్టేసి  కొట్టి చంపారు.  శుభకార్యంలో  జంట హత్యలు  జరగడంతో  బంధువులు  శోకసముద్రంలో  మునిగిపోయారు. ఈ సంఘటనపై  సమాచారం అందుకున్న  జి.మాడుగుల   ఎస్ ఐ  ఉపేంద్ర  ఘటన స్థలానికి చేరుకొని  పరిస్థితి  గమనించారు.  జంట హత్యలకు  దారి తీసిన వివరాలు సేకరించి    కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించామని   నిందితులను  అరెస్టు చేస్తామని  ఉపేంద్ర తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...