అనకాపల్లి, పెన్ పవర్ : కరోనా వైరస్ వ్యాప్తిని కేంద్రము జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపిoదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొణతాల వెంకటరావు తెలిపారు .రాష్ట్రఎన్నికల అధికారి నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్మోనరెడ్డి స్పందించిన తీరు ఆయన పదవికి ఎంత మాత్రం సరైనది కాదనారు. రాజ్యాంగ బద్ధమైన పదవులు ఉన్న రాష్ట్ర ఎన్నికల అధికారికి ఉద్దేశాలు ఆపాదించడం ఆగమేఘాలమీద గవర్నర్ ను కలిసి ఆయనపై ఫిర్యాదు చేయడం ముఖ్యమంత్రి ఆసహానానికి అద్దం పడుతుందనారు. వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందన్న భయం తోటే చంద్రబాబునాయుడు తన అనుకూల అధికారితో ఎన్నికలను వాయిదా వేయించారని ఇష్టారీతిగా ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు . కొందరు మంత్రులు శాసనసభ్యులు సైతం వీరంగం చేశారనారు. మన రాష్ట్రంలో కూడా అందరూ కలిసి ప్రభుత్వం ముందుకు వచ్చే నాయకత్వం వహించాలి. కరోనా వంటి విషయములో కుల రాజకీయాలు కుహానా రాజకీయాలకు తగవు. ఫైనాన్స్ కమిషన్ నిధులు కోసమే ఎన్నికల అంటున్న తరుణంలో కేంద్రమే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించినందున ప్రత్యేక పరిస్థితుల రీత్యా నిధులకు విధించిన నిబంధలను సడలింపు నకు రాష్ట్రం ప్రయత్నం చేయాలి. నిధులు సాధనకు అవసరమైతే అఖిల పక్షాలను ప్రభుత్వం కేంద్రం వద్దకు తీసుకువెళ్లాలి . నిధుల కోసం రాద్ధాంతాలు రాజకీయాలు మాని కరోనా అదుపు చేయుటకు కలిసి పనిచేసే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment