పరవాడ, పెన్ పవర్ : మండలం లోని లంకెలపాలెం నాలుగు కొన్ని రోడ్ల జంక్షన్ లో సిగ్నల్ పాయంట్ దగ్గర వాహనదారులను ఐదు నిమిషాలు నిలిపి కొరోనా వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పరవాడ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బంగారు పాప ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ రామకృష్ణ కొన్ని సూచనలను చెప్పారు.జనతా కర్ఫ్యూ యొక్క ముక్యఉద్దేశం కొరొనా వైరస్ (కోవిడ్ 19) అనే వ్యాధి యొక్క వైరస్ 9 గంటలు జీవించి ఉంటుంది కనుక ప్రజలంతా కూడా 12 గంటల పాటు ఎటువంటి పనులు పెట్టుకోకుండా వారి వారి ఇళ్లలో నే వుండి ఈ వైరస్ నివారణకు సహకరించాలి అని సూచించారు.ఈ వైరస్ కి ప్రస్తుతానికి ఎటువంటి మందులు లేవు అని నివారణ ఒక్కటే ప్రస్తుత ఉన్న మార్గం అని అన్నారు.ఈ వ్యాధి లక్షణాలు దగ్గు,జలుబు,జ్వరం తో పాటు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడతారు అని ఈ లక్షణాలు ఉన్నవాళ్లు తప్పకుండా వైద్యులనుసంప్రదించి పరీక్షలు చేసుకోవాలి అన్నారు.ఈ వ్యాధి ఉన్నవారు పబ్లిక్ ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి వస్తువులను తాకడం వలన లేదా దగ్గడం,లాలాజలం ఉమ్మడం లాంటివి చేయరాదు అని సూచించారు.అలా చేయడం వలన ఆ పరిసరాల్లో సంచరించే ప్రజలకు వ్యాధి గ్రస్థుడు తాకిన వస్తువులను తాకడం వలన ఈ వైరస్ సంక్రమిస్తుంది అని అన్నారు.పబ్లిక్ ప్రాంతాల్లో సంచరించేటప్పుడు తుమ్మినా,దగ్గినా హేండ్ కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి అని లాలా జలాన్ని ఉమ్మడం లాంటి వాటిని చేయకూడదు అన్నారు.ఎవరి తో అయినా మాట్లాడేటప్పుడు కనీసం నాలుగు అడుగుల దూరం లో ఉండి మాట్లాడటం లాంటి జాగ్రత్తలు ఎవరికి వారే వ్యక్తి గతంగా పాటించి వ్యాధి నివారణకు సహకరించాయిలి అని అన్నారు.ఎవరిని అయినా కొత్తవారిని కానీ పరిచస్తులను కానీ పలకరింపుగా ఆలింగనం,కరచాలనం లాంటి చేయరాదు అని వారికి సమస్కారంగా నమస్కారం మాత్రమే పెట్టాలి అని సూచించారు.ప్రతి వక్కరు ఇంటికి వెళ్ళగానే కాళ్లు, చేతులు, గోరు సంధుల్లో శుభ్రంగా 30 సెకన్ల పాటు కడిగినాక ఇంటిలోకి వెళితే ఈ వైరస్ని వారి కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా నివారించ వచ్చు అని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని అందరూ పాటించి ఆదివారం ప్రజలు ఇళ్లవద్ద నుండి బయటకు రాకూడదు అని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment