Followers

ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు


 


పెన్ పవర్, ప్రత్తిపాడు


తనకు తెలియకుండా ఆస్తిని తాకట్టు పెట్టిందనే కోపంతో కన్నతల్లి నే కడతేర్చిన సంఘటన ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో శు క్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం సమయంలో నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి తన తల్లితో ఉన్న ఆస్తిపై తగాదా పెట్టుకుని ఇంటి నుండి బయటకు వెళ్లి, రాత్రి సమయంలో తన తల్లితో కలిసి ఆస్తి విషయంలో మరో మారు తగాదా పడ్డాడు. తల్లి పేరున ఉన్న మూడున్నర ఎకరాల భూమి వేరొకరి వద్ద తనఖా పెట్టిందని, ఆ విషయమై తల్లిని అడుగగా తల్లి చెప్పిన సమాధానంతో కోపోద్రిక్తుడైన కొడుకు శ్రీనివాస్ పక్కనే ఉన్న వెదురు కర్రతో తల పైన గట్టిగా కొట్టాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మరణించింది. రాత్రి గ్రామస్తులు 100 కి ఫోన్ చేయగా అప్పటికే తల్లి నిమ్మల రత్నం (70) మృతి చెందిందని, ముద్దాయి పరారీలో ఉన్నాడని ప్రత్తిపాడు సిఐ సన్యాసిరావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...