గాజువాక, పెన్ పవర్
పరిసరాలను శుభ్రంగా వుంచుదాం... కరోనా మహమ్మారిని తరిమికొడదాం....76 వార్డు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణ
కరోనా వైరస్ పట్ల ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు 76 వార్డు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణ వార్డు లో పర్యటించారు . ఈ కార్యక్రమంలో వార్డు స్థాయి ముఖ్య నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని, కానీ వైద్యులు సూచించిన విధంగా కొద్దిపాటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ప్రభుత్వం సూచిస్తున్న పద్ధతులను ప్రజలు తప్పక పాటించాలన్నారు. ఎక్కువ జన సమూహాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆయన పిలుపునిచ్చారు. అలాగే రెండు నిముషాల పాటు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, ఎక్కువగా జన సమూహాలకు దూరంగా ఉండాలని, దగ్గు తుమ్ము వచ్చినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, ఇలా కొన్ని పద్ధతులను తెలియజేశారు. ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మార్ట్టుపూడి పరదేశి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్య వివరాలను ప్రత్యేక యాప్ లో పొందుపరచడం జరిగిందని, అదేవిధంగా వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నామని, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని, ఇప్పుడు ఆ బాధ్యత మరీ ఎక్కువగా ఉందని సూచించారు. సమావేశం అనంతరం 76 వార్డు వైఎస్ఆర్ సీపీ దొడ్డి రమణ ఆధ్వర్యంలో వార్డులో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేనిసెట్టీ చిన్నారావు, వజ్రపు త్రినాథ రావు,బోత్స్ వాసు,డిపో రాజు, మంత్రి మంజుల,ఆర్.సుజాత,స్వాతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment