Followers

డైక్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్


 

శ్రీకాకుళం, పెన్ పవర్ : నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్ పనులను జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం పరిశీలించారు. నాగావళి రివర్ ఫ్రంట్ వ్యూ పార్కులో భాగంగా నిర్మిస్తున్న డైక్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీకాకుళం పట్టణ వాసులకు మంచి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కల్పించాలన్నారు. నాగావళి నదిలో డైక్ నిర్మాణం వలన సంవత్సరం పొడుగునా కనీసం ఒక మీటరు లోతులో నీరు నిల్వ ఉంటుందని, బోటు షికారు వంటి ఏర్పాట్లకు అవకాశం పరిశీలించాలని ఆయన ఆదేశించారు. డైక్ నిర్మాణం వలన నీరు నిల్వ ఉండి ఆహ్లాద వాతావరణం ఏర్పడటంతో ప్రజలు వీక్షించుటకు వస్తారని అందుకు తగిన ప్లాట్ ఫారాలు నిర్మించాలని ఆదేశించారు. నాగావళి నదికి రెండు వైపులా – ఆర్ట్స్ కళాశాల దిక్కులోను, దత్తాత్రేయ ఆలయం దిక్కులోను సురక్షితంగా, ప్రశాంతంగా వీక్షించుటకు అవసరమగు మెట్లను నిర్మించాలని సూచించారు. నది మధ్యలో జిల్లా విశిష్టతను తెలియజేసే చారిత్రాత్మక విగ్రహాన్ని నెలకొల్పుటకు అవకాశాలు పరిశీలించాలని పేర్కొన్నారు. డైక్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఇప్పటికే నిర్మాణంలో జాప్యం జరిగిందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం నగరపాలక సంస్ధ కార్యాలయంలో సమీక్షిస్తూ నగర పాలక సంస్ధ పరిధిలో చేపట్టిన పనులు వేగవంతం కావాలని కలెక్టర్ ఆదేశించారు. డైక్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నవభారత్ జంక్షన్ నుండి పాత బ్రిడ్జి వరకు నిర్మిస్తున్న రహదారి పనులు మూడు వారాల్లో పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. జాప్యం జరగరాదని పేర్కొన్నారు. ఇతర పనులు కూడా త్వరితగిన పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, సహాయ కమీషనర్ శివ ప్రసాద్, ఇపిడీసీఎల్ ఎస్ఇ ఎన్. రమేష్, జిల్లా ఆడిట్ అధికారి కె. రాజు, నగర పాలక సంస్థ ఇంజినీర్లు రమణ మూర్తి, మాధవ రావు, ప్రజా ఆరోగ్య శాఖ డిఇ వెంకట రావు, ఆరోగ్య అధికారి వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...