అనకాపల్లి, పెన్ పవర్ : టెక్సాస్ డల్లాస్ లో 2020 కు గానూ నాసా నిర్వహించిన పోటీల్లో అనకాపల్లి రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మే నెలలో జరగనున్న అంతర్జాతీయ సమ్మేళనం లో బహుమతులు అందుకొోనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. గత 11 ఏళ్లుగా నాసా నిర్వహిస్తున్న పోటీల్లో వరుస విజయాలను తమ పాఠశాల విద్యార్థులు విజయాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రణాళిక రచన, విధి విధానాలు, క్రమశిక్షణలో ఆయుధంగా మలిచి విద్యార్థులను ఉత్తమ విద్యార్ధులుగా తీర్చిదిద్దుతున్నామని విద్యాసంస్థల చైర్మన్ మణి పేర్కొన్నారు . ఈ కార్యక్రమం లో జి ఎం మూర్తి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment