Followers

జనతా కర్ఫ్యూ పట్టించుకోకుంటే  చర్యలు తప్పవు.


 


స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(  పెన్ పవర్) కరోనా  వైరస్   అంతం చేయడానికి  ప్రతి ఒక్కరూ  జనతా కర్ఫ్యూ లొ  పాల్గోవాలని  జిల్లా యంత్రాంగం   డిమాండ్ చేస్తుంది.  22వ తేదీ  ఆదివారం  ప్రతి ఒక్కరూ  జనతా  కర్ఫ్యూ  పాటించాలని  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు  జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులు  ఆధ్వర్యంలో  జనతా కర్ఫ్యూ  విజయవంతం చేయాలని  హుకుం జారీ చేశారు. జిల్లా కేంద్రాలు  మండల కేంద్రాలు  గ్రామాలు  అన్ని చోట్ల   జనతా కర్ఫ్యూ  కొనసాగాలని  కింది స్థాయి అధికారులకు  హెచ్చరికలు చేశారు. దీంతో  ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి  రాత్రి 9 గంటల వరకు  ప్రజలు  బయట తిరగకుండా  ఇళ్లకే పరిమితం కావాలని  చూపించారు. ప్రజలు  బహిరంగ ప్రదేశాల్లో  సంచరించ కపోతే  ఉష్ణోగ్రతకు  వైరస్  నశించిపోతుందని  వైద్యశాఖ  వెల్లడిస్తుంది.  దుకాణాలు  ఇతరత్రా  కూడా మూసివేయాలని   ఆదేశిస్తున్నారు. ఇందులో భాగంగా రైతు బజార్లు  షాపింగ్ మాల్స్  థియేటర్లో   వారపు సంతలో  మార్కెట్లు  మూసివేసి   కరోనా  వైరస్ నివారణకు  సహకరించాలని  అధికార యంత్రాంగం కోరుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  రెవెన్యూ డివిజన్  కేంద్రాల్లో  ఆర్ డి ఓ  డీఎస్పీ  మండల కేంద్రాల్లో తహసీల్దార్లు  సబ్ ఇన్స్పెక్టర్లు  ఎంపీడీవోలు  కరోనా మహమ్మారిపై  ప్రచారాలు  చేస్తున్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుంటే చర్యలు తప్పవని  మైకుల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మన వంతు కృషిచేయాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...