Followers

  చీమ చిటుక్కుమన్న  ఉలిక్కి పడుతున్న అధికార యంత్రాంగం.



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం ( పెన్ పవర్) జిల్లాలో అధికార యంత్రాంగం చీమ  చిటుక్కుమన్న  ఉలిక్కి  పడుతున్నారు. ఎక్కడ  తుమ్ము దగ్గు  వినిపించిన  అక్కడ   వాలిపోతున్నారు. పరీక్షల పేరుతో   ఆస్పత్రుల చుట్టూ  తిప్పక తప్పడం లేదు.  అనుమానం కలిగితే   హోమ్ హై పొజిషన్లో  ఉంచుతున్నారు. రోజుల తరబడి  గృహ నిర్బంధానికి  గురికాక తప్పడంలేదు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించకుండా  ప్రభుత్వం  పటిష్టమైన చర్యలు   చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులు  ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి  సిబ్బందిని అప్రమత్తం చేశారు.  24 గంటలు  ప్రజలను  పరిశీలించాలని  ఆదేశాలు జారీ చేశారు.  వలసలు పోయి  ఇతర ప్రాంతాల నుంచి  ఎవరు వచ్చినా  వారిని  పరీక్షలు  చేయందే  విడిచి పెట్టడం లేదు. అనుమానం వస్తే  రోజుల తరబడి  గృహనిర్బంధం  ఉండాలని  హెచ్చరిస్తున్నారు. ఈ నిబంధనలు  చూసి  పలువురు  వైద్యం దాటి  పరార్ అవుతున్న సంఘటనలు లేకపోలేదు. జి ముంచింగిపుట్టుకి  చెందిన వ్యక్తి  ఢిల్లీ నుంచి  వచ్చినట్లు  గుర్తించి  పరీక్షలకు  వైద్య సిబ్బంది   వెళ్లగా   తప్పించుకొని పరారయ్యాడు. పోలీసులు  సహకారంతో  శనివారం పట్టుకొని  పాడేరు ఏరియా ఆసుపత్రికి అప్పగించారు.  గొలుగొండ మండలం లక్ష్మీపురం  వ్యక్తి  కెనడా నుంచి  రావడంతో పరీక్షలు చేశారు  రొంప దగ్గు  ఉండడంతో  పరీక్షల నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు. కొయ్యూరు రేపల్లె గ్రామానికి చెందిన  వ్యక్తి షిరిడి పోయి వచ్చాడు  అతనికి జ్వరం  జలుబు  ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం గృహనిర్బంధం  చేశారు. నర్సీపట్నం ఏరియా లో  బయటనుంచి వచ్చిన  ఇరువురికి  పరీక్షలు చేసి  మాస్కులు వేసి  ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా  గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం  సింగపూ  మలేషియా  దుబాయ్ చెన్నై బెంగళూరు తదితర ప్రాంతాలకు వలసలు పోయారు అక్కడ పరిస్థితులు  విషమించడంతో   వారు తిరిగి  స్వగ్రామాలకు చేరుతున్నారు.  ఇతర ప్రాంతాల నుంచి గ్రామాల్లో అడుగుపెట్టిన  ప్రతి ఒక్కరిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వారికి దూరంగా ప్రజలు ఉండాలని వారు గృహం దాటి బయట సంతరించ  వద్దని హెచ్చరిస్తున్నారు. కస్పా జగన్నాధపురం కి అమెరికా నుంచి 21 మంది కోడూరు కు సింగపూర్ నుంచి 12 మంది వలసదారులు వచ్చారు. వీరిని  వైద్య సిబ్బంది ఆది నంలో ఉంచారు. నిర్మలా కాలనీకి చెందిన మహిళ దుబాయ్ నుంచి వచ్చి  వైద్యానికి నిరాకరించడంతో  పోలీసుల సహకారంతో  వైద్యానికి అప్పగించారు. ఇతర ప్రాంతాల నుంచి  ఎవరు  వచ్చిన  గృహ నిర్భంధం తప్పలేదు .


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...