Followers

ప్రణాళికబద్దంగా బ్రిడ్జి కోర్సు నిర్వహించాలి: డిఇఒ లింగేశ్వరరెడ్డి


 



మాకవరపాలెం, పెన్ పవర్ :  ప్రతీ పాఠశాలలోను ప్రణాళికాబద్ధంగా బ్రిడ్జి కోర్టు నిర్వహించి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యంలను మెరుగుపరచాలని జిల్లా విద్యా శాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం ఎంపియుపి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి కోర్టు విద్యార్థుల భవిష్యతను తీర్చిదిద్దేదన్నారు. దీనిని ఎవరు అలసత్వం చేసిన శిక్షార్హులు అవుతారన్నారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వారంలో ఒకసారి ప్రతీ ప్రాధమిక పాఠశాలను సందర్శించి బ్రిడ్జి కోర్టు ప్రాధమిక పాఠశాలను సందర్శించి బ్రిడ్జి కోర్సు నిర్వహణ ఏ విధంగా ఉంది సమీక్ష చేయాలని సూచించారు. బ్రిడ్జి కోర్టు టైం టేబుల్ ప్రకారం ప్రతీ పాఠశాలలోను బోధన జరగాలన్నారు. ఈ పాఠశాలలో ఇంకా బేసిలైన్ పరీక్ష పేపర్లు దిద్దలేదని, మరలా ఇటువంటి పొరపాట్లు జరగకూడదని అన్నారు. బేసిలైన్ పరీక్ష మార్కులు అప్ లోడ్ చేయాలని చెప్పారు. డైరీ రాయాలని సూచనలు చేశారు. నాడు నేడు కార్యక్రమం కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సివి.రమణ, ఉ పాధ్యాయులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...