Followers

కరోనా వైరస్ కు నివారణ ఒక్కటే మార్గం


కరోనా వైరస్ కు నివారణ ఒక్కటే మార్గం:


సూపర్ వైజర్ కృష్ణకుమారి


కంభం, పెన్ పవర్
            కరోనా వైరస్ ను అరికట్టాలంటే నివారణ ఒక్కటే మార్గమని సూపర్ వైజర్ కృష్ణకుమారి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోని రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ పాటించినప్పటికీ ప్రజలందరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే వైరస్ ను అరికట్టగలమన్నారు. కరోనా వైరస్ పై అవగాహన కల్పించడంలో భాగంగా మండలంలోని కందులాపురం పంచాయతీ పూసలబజార్ లో గల గుడారాలలో నివాసం ఉంటున్న జంగాల వాళ్లకు సూపర్వైజర్ కృష్ణకుమారి కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో వివరించి, చేతులు ఎలా శుభ్రపరచుకోవాలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ సందర్భంగా పూసలబజార్ లో గల అంగన్ వాడి పిల్లలకు వారి ఇంటి దగ్గరికి వెళ్లి కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ కృష్ణకుమారి తో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పి. శ్రీదేవి, సిహెచ్ అనురాధ పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...