పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, కాకినాడ
పీసపాటి చంద్రశేఖర్ కుమారుడు పీసపాటి శ్రీకృష్ణ చైతన్య (35) స్వీడన్ దేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఈ నెల 20వ తేదీన గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, స్థానిక సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లు శనివారం చంద్రశేఖర్ నివాసానికి చేరుకుని మృతుని తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపి వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు కృష్ణ చైతన్య మృతదేహాన్ని కాకినాడకు రప్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు చేపడతున్నామని తెలిపారు. వీరితో పాటు ప్రముఖ ఆత్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు పీసపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో వున్నారు.
No comments:
Post a Comment